వేస్టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

దిండిగల్ లో జీహెచ్ఎంసి చేపట్టిన 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ టీ అర్ ఐ ( ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్) డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ తో కలిసి జి హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్ల లోని ఆపరేషన్ కు సంభందించిన అన్ని యూనిట్ల ను పరిశీలించారు. వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభానికి అన్ని అనుమతులు సిద్దం చేయాలని యస్ డబ్లు ఏం అధికారులకు, రీల్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి వారు లేవనెత్తిన అంశాలను వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏజెన్సీ కి సూచించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ డబ్లు ఏం యస్ సి కోటేశ్వర రావు, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి రీల్ సంస్థ ప్రతినిధులు తదితరులు హజరయ్యారు.




