Sunday, September 8, 2024

చంద్రబాబును చూసి నేర్చుకోండి

- Advertisement -

చంద్రబాబును చూసి నేర్చుకోండి
హైదరాబాద్, జూన్ 17,
పింఛన్ల పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని చూసైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు రూ.4 వేలకు పింఛన్లు పెంచారని.. ఆ మేరకు మొదటి సంతకం పెట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ఏపీని చూసైనా నేర్చుకోవాలని.. రూ.4 వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు,కాగా తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హరీష్ రావు స్పష్టంచేశారు. తాను కాంగ్రెస్, బిజెపిలో చేరుతున్నానంటూ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్స్‌ పెట్టి కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకపై ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వ్యూస్ కోసం తప్పుడు రాతలా
వ్యూస్ కోససం ఓ నాయకుడి నిబద్ధతను, నిజాయతీని దెబ్బతీయొద్దని మీడియాకు హితవుపలికారు.  అలాంటివి మానుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఘాటుగా చెప్పారు.సంచలనాల కోసం తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్‌లో చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. “వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అయ్యానని, కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏవేవో చెబుతున్నారు. దయచేసి ఇలాంటి పెట్టకండి. లైక్స్, వ్యూస్ కోసం నాయకుడి నిబద్ధత, నిజాయితీని దెబ్బతీయకండి. ఇలాంటివి మానుకోకపోతే లీగల్ చర్యలు  తీసుకోడానికి  వెనుకాడబోం.” అని అన్నారు. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై మండిపడ్డారు. “గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్కమిషన్ ఛైర్మన్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం చేతుల్లోనే అంతా ఉందంటున్నారు. ప్రజా దర్బార్‌కు వెళ్లి కాళ్లమీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరామ్ దగ్గరికి వెళ్లినా స్పందన లేదు. కొత్త  హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలన అమలు చేయమని కోరుకుంటున్నారు.” “కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరఫున 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. గ్రూప్ 1కు 1:100 చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 2కు 2వేలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి. పరీక్షల మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జులైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. వెంటనే ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ ఉందన్న ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామన్నారు. ఆరునెలలైనా ఇంకా ఎందుకివ్వలేదు? 25 వేల పోస్టులతో ఇస్తామన్న డీఎస్సీ 11 వేల పోస్టులతో ఎందుకు ఇచ్చారు. మొత్తం 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి. నిన్నమొన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చింది. పాత బకాయిలను కూడా కలిపి ఇస్తోంది. ఇక్కడ ఆరు నెలలైనా ఎందుకు 4 వేల రూపాయల పింఛన్ ఇవ్వడం లేదని హరీష్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చే పింఛన్ కూడా ఎందుకివ్వడం లేదని నిలదీశారు. “ఇంటికి 2 పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలు చేయడం లేదు. పేదల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం? ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి. ఒక్కొక్కరికి 12 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఈ నెలకు కలిపి మొత్తం 16 వేలు ఇవ్వాలి.””ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం మాట తప్పింది. ఎన్ హెచ్ఎం, ఆశావర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్‌లో గ్రేస్ మార్కుల విధానమే లేనప్పుడు ఎలా కలిపారు?  ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి, పార్లమెంటు ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారు? ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదు? పేపర్ లీక్ కాకపోతే బిహార్, గుజరాత్‌లో ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి? తెలుగు విద్యార్థులకు అన్యాయం జరక్కుండా బీజేపీ ఎంపీలు, మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి. ఇంత ప్రధాన సమస్యమై మీరెందుకు మాట్లాడ్డం లేదు?

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్