- Advertisement -
మంత్రి తలసాని
హైదరాబాద్: నేను చేసిన అభివృద్దిని చూడండి. ఎన్నికల్లో ఆశీర్వదించండని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాడు అయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయన స్థానికులు మంగళహారతులు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలతో ఘాన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ 50 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపెట్టాం. ప్రజలు చూపెడుతున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీతో గెలుస్తానని అన్నారు.

- Advertisement -