Sunday, September 8, 2024

నరకాసుర” సినిమా సూపర్ హిట్ అవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాం – హీరో రక్షిత్ అట్లూరి

- Advertisement -

“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు.  ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్, తన కెరీర్ విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు రక్షిత్ అట్లూరి.

– “నరకాసుర” మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్ గా కనిపిస్తాను. నా గత సినిమా పలాసలో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే “నరకాసుర” సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ ట్రాన్స్ జెండర్స్ అంశం కథలో ఒక సంఘర్షణకు కారణంగా నిలుస్తుంది.
– పలాస సినిమా రిలీజైన తర్వాత 2020లో “నరకాసుర” మూవీ స్టార్ట్ చేశాం. ఏడాదిలో సినిమా కంప్లీట్ చేయాలనుకున్నాం. అయితే ఇది పెద్ద స్కేల్ సినిమా. నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్ ఇలా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. కథపరంగా ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేశాం. మధ్యలో రెండు సార్లు కోవిడ్ వేవ్స్ వచ్చాయి. దాంతో ఆర్టిస్టుల కాంబినేషన్స్ కు డేట్స్ కుదరలేదు. ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ కే రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుంది. నేను ఈ క్యారెక్టర్ కోసం చేసుకున్న గెటప్ వల్ల మరో ప్రాజెక్ట్ చేయలేకపోయాను. మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయి చేయి కోల్పోవడం కూడా డిలేకు కారణం అయ్యింది. అయితే “నరకాసుర” కంప్లీట్ చేసే దశలో ఆపరేషన్ రావణ్, శశివదనే అనే రెండు సినిమాల్లో నటించాను. ఆ రెండు సినిమాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

We are confident that Narakasura will be a super hit - Hero Rakshit Atluri
We are confident that Narakasura will be a super hit – Hero Rakshit Atluri

– ఈ మూవీలో నరకాసుడికి సంబంధించిన అంశాలేవీ ఉండవు. టీజర్ లో చూపించినట్లు రాక్షసుల్ని చంపాలంటే మనం అంతకంటే చెడ్డగా ఉండాలి అనే పోలికను తీసుకుని టైటిల్ పెట్టుకున్నాం. గత మూడు నెలలుగా ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెల 3వ తేది మా సినిమా రిలీజ్ కు మంచి డేట్ అనుకున్నాం. ఎందుకంటే దసరా సినిమాల సందడి కాస్త తగ్గింది. అలాగే పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కావడం లేదు.
– “నరకాసుర”లో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 20 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. అక్కడ చలి ఎక్కువ. పైగా రాత్రి పూట వర్షంలో ఆ ఫైట్ సీన్ చేయాల్సివచ్చింది. అప్పుడు కష్టం అనిపించినా…స్క్రీన్ మీద ఔట్ పుట్ చూశాక హ్యాపీగా ఫీలయ్యాం. ఈ సినిమాకు పుష్ప మూవీకి ఎలాంటి పోలిక ఉండదు. మా సినిమా పుష్ప కంటే ముందే షూట్ బిగిన్ అయ్యింది. ఇందులో స్మగ్లింగ్ లాంటివి ఉండవు. కాఫీ ఎస్టేట్ లో నేను లారీ డ్రైవర్ గా పనిచేస్తా.
– ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేసినప్పుడే పాన్ ఇండియా మూవీ చేద్దాం అని అనుకున్నాం. కాస్టింగ్ కూడా నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్ వంటి వారిని తీసుకున్నాం. కథలోనూ పాన్ ఇండియా ఎలిమెంట్స్ ఉంటాయి. ఏపీ, తమిళనాడు బార్డర్ కాఫీ ఎస్టేట్ కాబట్టి అక్కడ పనిచేసే వ్యక్తుల క్యారెక్టర్స్ కూడా కొందరు తమిళంలో మాట్లాడతారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు నా మరదలుగా నటించారు. మరో హీరోయిన్ కాఫీ ఎస్టేట్ మేనేజర్ క్యారెక్టర్ చేసింది. ఇద్దరు హీరోయిన్స్ కేరళ నుంచే వచ్చారు. మా టీమ్ లో ప్రతి ఒక్కరు డెడికేషన్ తో వర్క్ చేశారు. ఈ సినిమాలో అనుభవమున్న నటీనటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. చరణ్ రాజ్ ఊరి పెద్ద క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయనది కీ రోల్. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. నాకు ఆయనకు మధ్య కాన్ ఫ్లిక్ట్ ఉంటుంది. అది హీరో, విలన్ గొడవలా ఉండదు.
– మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే పలాస మూవీలో నేను చేసిన యాక్షన్ సీన్స్ చూకున్నప్పుడు ఫైట్స్ బాగా చేశాను అనిపించింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పలాస సినిమాలో నాలుగు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాను అనే పేరొచ్చింది. ఆ పేరు కాపాడుకుంటూ సినిమాలు చేస్తా. పాటలు,  పైట్స్ ఉన్న ఫార్మేట్ లో వెళ్లను. పలాసలో నక్కిలీసు గొలుసు పాట హిట్ అయ్యిందని నరకాసురలో అలాంటివి పెట్టలేదు. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ కథలో భాగంగా వస్తుంటాయి. నరకాసుర సినిమా చేస్తున్నప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కానీ నేను ఈ గెటప్ వల్ల చేయలేకపోయాను. పొలిమేర 1 కూడా నేనే చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్స్ చేయలేకపోయినందుకు బాధ లేదు. మా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం.
– సినిమా మేకింగ్ ఆలస్యమవడం వల్ల బడ్జెట్ పెరిగింది. అయితే మా ప్రొడ్యూసర్స్ పూర్తి సపోర్ట్ చేశారు. సినిమా ఔట్ పుట్ వల్లే మేమంతా నమ్మకంగా ఉన్నాం. శశివదనే, ఆపరేషన్ రావణ్ పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. శశివదనే డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నాను. రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్