మేం గేట్లు ఎత్తడం లేదు.. వాళ్లే దూసుకువస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు.
నల్గొండ, భువనగిరిలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. చేరికల కోసం మేం గేట్లు ఎత్తడం లేదు.. వాళ్లే దూసుకువస్తున్నారు.. ఆయన నేర్పిన విద్యనే కదా అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని బీజేపీ కులగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా….? ఇదేమైనా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర కాదన్నారు. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరం అయితే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు.