మనం ప్రజా సేవకులం..ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
We are public servants..let us work accountable to the people
సమస్యల పరిష్కారమే మనందరి అజెండా కావాలి.
కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దు .
కొత్త చెరువు లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వెల్లడి
కొత్త చెరువు:28
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలకులు, అధికారులు కలిసికట్టుగా ప్రజా సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం జవాబుదారీగా పని చేద్దామన్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం కార్యాలయం వద్దకు వస్తే వాటి పరిష్కారానికి తగిన మార్గం చూపాలే కానీ అదేపనిగా కార్యాలయం చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దని సూచించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కొత్తచెరువు ప్రధాన పట్టణంగా మారింది. కొత్తచెరువు పట్టణంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు త్రాగునీరు ఇండ్ల స్థలాలు విద్యుత్ సమస్య ఎక్కువగా ఉన్నాయి. వీటి పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ముఖ్యంగా కొత్తచెరువు ప్రజల రాక పోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అసౌకర్యంగా ఉందని తెలిపారు వీటి స్థానంలో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం కేంద్ర రైల్వే సహాయం మంత్రి సోమన్న గారిని స్వయంగా ఈ ప్రాంతానికి పిలిపించి ప్రజల సమస్యను విన్నవించామన్నారు .అతి త్వరలో వాటి పరిష్కారానికి తగిన నివేదికలు వెంటనే ఇవ్వాలని సంబంధిత రైల్వే అధికారులకు మంత్రి సోమన్న గారు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వెల్లడించారు.
కొత్తచెరువు ప్రధాన పట్టణం కావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, వీటికి పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించారు.
కొత్తచెరువు పట్టణ మీదుగా రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచిందని గుర్తు చేశారు తాడిపత్రి బత్తలపల్లి ధర్మవరం కొత్తచెరువు మీదుగా జగరాజుల పల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. అలాగే పావుగడ మడకశిర పెనుగొండ కొత్తచెరువు బుక్కపట్నం జాతీయ రహదారిలోకి మరో మార్గం అనుసంధానం కానుందని తెలిపారు. దీనివల్ల రోడ్ల విస్తరణతో పాటు ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.
అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం… కొత్తచెరువు పట్టణంలో ప్రధాన రోడ్లపై విస్తరించిన అక్రమ కట్టడాలతో పాటు పలు కాలనీ వీధుల్లో డ్రైనేజీలను ఆక్రమించిన వాటిని తక్షణం తొలగించాలని రెవెన్యూ, పోలీస్ సహకారంతో పంచాయతీ అధికారులు తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.