Wednesday, December 4, 2024

22 లక్షల ఓట్లు తొలగించాం

- Advertisement -

ఎన్నికలకు  ఈసీ రెడీ

హైదరాబాద్, అక్టోబరు 5:  తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 2022-23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన… డెత్ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్ వచ్చిన తర్వాతే ఓటర్లను జాబితా నుంచి పేర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు ప్రచార ఖర్చును పెంచాలని పార్టీలు కోరినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. ట్రాన్స్ జెండర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600  మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 3.17 మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించింది సీఈసీ. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు తెలిసింది.

we-deleted-22-lakh-votes
we-deleted-22-lakh-votes

దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం..ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.  మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్ తాజ్‌ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని CEC రాజీవ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతో కూడా అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పరిశీలించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు CEC, ఇద్దరు కమిషనర్లు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్