దేశంలో నీతివంత మైన పాలన అందించాం
తెలంగాణాకు కేంద్రం రూ.10 లక్షల కోట్ల నిధులు
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
జగిత్యాల, మార్చి 18
దేశానికి 10 ఏళ్ళల్లో బీజేపీ ప్రభుత్వం నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో అన్ని రకాల మౌలిక సదుపాయాల లు కల్పించామని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం10 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, చంద్రయాన్ ప్రయోగం, జాతీయ స్థాయిలో పసుపుబోర్డు ఏర్పాటు చేసి బీజేపీ అద్భుత పాలన అందించిందన్నారు. తెలంగాణా లో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంభకోణంతో అక్రమంగా సంపాదించిందని ,కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పేదవాడికి ఉచితంగా గత మూడేళ్ళుగా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, రైతులకు ఏడాదికి6 వేలు పెట్టుబడి సాయం అందింస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. సమ్మక్క, సారక్క పేరిట జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.మోదీ పాలనలో భారత్ వెలిగిపోతుందని మూడోసారి మోదీ పాలన దేశంలో రాబోతోందని, ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్దిక సాయం అందిస్తున్న వాళ్లను వదిలేద్దామా? వాళ్ల చెవుల్లో రక్తం కారేలా నినదించాలా? లేదా? అని సంజయ్ హెచ్చరించారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను కన్న గడ్డ జగిత్యాల అని చెప్పారు.
రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎసోళ్లు గజగజ వణుకుతున్నరని పేర్కొన్నారు.
దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముడి గుడిని కట్టింది బీజేపీయే స్పష్టం చేశారూ.
బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో వెళుతుంది.. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండని రాజకీయ పార్టీలకు సవాల్ చేశారు.
తెలంగాణ ప్రజాలారా…. ప్రతి ఒక్కరూ ‘‘రజాకార్’’ సినిమా చూడండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
నిజాం సమాధివద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి ఈ సినిమా చూపండన్నారు.
నిజాం, రజాకార్ల అరాచకాలను, తెలంగాణ ప్రజల తెగువను కళ్లకు కట్టినట్లు రాజాకర్ సినిమా చూపించిందని సంజయ్ తెలిపారు.
మళ్లీ నిజాం పాలన కోరుకునే వాళ్లకు ‘రజాకార్’ సినిమా కనువిప్పు కావలన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ 3వ సారి కేంద్రంలో మోదీ నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.