Sunday, September 8, 2024

ఇలాంటివి ఎన్నో చూశాం..

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

విజయవాడ:  అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.  సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా ?  అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా?  అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు ?  రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. కక్ష సాధింపులే జగన్ లక్ష్యం. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలు. జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర పన్నారు.  స్కిల్ డెవలప్మెంట్ ముందుగా గుజరాత్లో ప్రారంభించారు.

We have seen many such things..
We have seen many such things..

సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు.  అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారు.  ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?  చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని అన్నారు.

ఇలాంటివి ఎన్నో చూశాం..  ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. ఉన్న సంస్థలు విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు.. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. పోలవరం ప్రాజెక్ట్ పడకేసింది. రాజధాని ఏదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో వుందని అన్నారు.

జగన్ పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలి. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది.  నేను మీ ముందుంటా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దామని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్