4.8 C
New York
Tuesday, February 27, 2024

పండుగ పూట  కాపలా కాస్తుంటాము

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే):  ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తూ ఉంటారని డీజీపి అంజనీ కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు జెండా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశవ్యాప్తంగా 189 మంది పోలీస్‌ సిబ్బంది వీరమరణం పొందారని అన్నారు. 189 మంది సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. దేశంలోని పోలీస్‌ శాఖలో ఉన్న పలు విభాగాలకు లీడర్ గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థలంలో ఉన్నారని తెలిపారు.

పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన డీజీపీ అంజన్ కుమార్

సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. భరోసా సెంటర్ దేశంలో రోల్ మోడల్ గా మారిందన్నారు. దేశ ప్రజలు ఇండల్లో ప్రశాంతంగా పండుకుంటున్నారంటే రోడ్డుపై పోలీసుల విధి నిర్వహణే కారణమని తెలిపారు.ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తూ ఉంటారని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రజలంతా కుటుంబ‌సభ్యులతో ఇళ్ళల్లో ఉంటే, కానిస్టేబుల్ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై విధి నిర్వహణ చేశారని గుర్తు చేశారు. విధి నిర్వహణ ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్న సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని అంజనీకుమార్ తెలిపారు. గొప్ప విజయం గొప్ప త్యాగం నుండి వస్తుందని అన్నారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీకుమార్ నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ‘అమరులువారు’ పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు కవాతు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మరణించిన 189 మంది పోలీసు అధికారుల పేర్లను చదివి వారి సేవలను స్మరించుకున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!