27.7 C
New York
Thursday, June 13, 2024

పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన డీజీపీ అంజన్ కుమార్

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 21: సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్‌ ఘనంగా నివాళులర్పించారు.

వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్‌ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

DGP Anjan Kumar paid tributes to police martyrs
DGP Anjan Kumar paid tributes to police martyrs

అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా మారాయని చెప్పారు. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో క్రైం రేట్‌ తగ్గుతూ వస్తున్నదని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సoడీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్, అనీల్ కుమార్, మహేష్ భగవత్ లతోపాటు పలువురు పోలీసు ఉన్నంత అధికారులు.రిటైర్డ్ డీజీపీలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, అమర పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున హజరయ్యారు…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!