
-TWJF State President Mamidi Somaiah’s call

We need to prepare for the fight on the issues of journalists
-TWJF State President Mamidi Somaiah's callహైదరాబాద్, నవంబరు 30: జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడమే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రత్యేకమని, సమస్యలపై పోరాటానికి సన్నద్దం కావాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టులంతా సమిష్టిగా పోరాడి హక్కులను సాధించుకోవాలని అన్నారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఉప్పల్ నియోజకవర్గం సమావేశం నాగార్జున నగర్ కమ్యూనిటీ హాలులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ,రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని అన్నారు. ఈ సంఘంలో సభ్యు లుగా చేరే ప్రతీ జర్నలిస్టుకు సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ చిన్న, పెద్ద భేదం లేకుండా, ప్రతి జర్నలిస్టుకు సభ్యత్వం, సమానత్వం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డులు, అర్హులైన వారికి అక్రెడిటేషన్ కార్డులు సాధించేందుకు ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు యావత్ జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని ఆయన గుర్తుచేసారు. జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రా లలో ఇళ్ల స్థలాల సాధనకు పోరాటం చేయడానికి ఫెడరేషన్ సిద్దమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జర్న లిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో సైతం అలాగే జరిగితే పోరాటం చేయక తప్పదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు
త్వరలో పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున జరిపేందుకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై సమిష్టిగా పోరాడి హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఇతర జర్నలిస్టు యూనియన్లకు భిన్నంగా ఫెడరేషన్ పనిచేస్తుందని, జర్నలిస్టుల పక్షాన నిలిచిన ఏకైక సంఘం అని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగితే పోరాటం చేయక తప్పదని అన్నారు. జర్నలిస్టులు నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా తమను తమ సంఘాన్ని బోలోపేతం చేసుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు తన్నీరు శ్రీనివాస్, ఎస్ కే సలీమా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, పటేల్ నర్సింహులు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు వేంపల్లి పద్మారెడ్డి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు యావపురం రవి, కోశాధికారి బెలిదె అశోక్, కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు గడ్డమీది అశోక్, కూకట్ పల్లి నియోజకవర్గ నాయకుడు మల్లేష్, మల్కాజిగిరి అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గ నాయకుడు వేణు తదితరులు పాల్గొన్నారు.
*ఉప్పల్ నియోజకవర్గం*
*టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ*
ఉప్పల్ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గంగి కృష్ణ, కార్యదర్శిగా రామచంద్ర మూర్తి, కోశాధికారిగా నరేష్ లతో పాటు 13 మంది సభ్యులతో ఉప్పల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.




