నులిపురుగు నివారణకు ముందుకు రావాలి.
We should come forward for the prevention of ringworm.
వరంగల్ డిఎంహెచ్ఓ. డాక్టర్ సాంబశివరావు.
వరంగల్ ప్రతినిధి.
నులి పురుగు నివారణ కోసం జిల్లాలోని ప్రజలు ముందుకు రావాలని వరంగల్ డాక్టర్ బి సాంబశివరావు జిల్లా ప్రజలను కోరారు జాతీయ నులి పురుగు నివారణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో వైద్యాధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ పి సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుండి వరంగల్ జిల్లాలో ప్రారంభమై ఈనెల 25 వరకు జరుగుతుందని డిఎంహెచ్వో తెలిపారు. అందుకుగాను జిల్లాలో మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు జిల్లాలో 1810 పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో 181807 విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని తెలిపారు వారికి ఈ సిబ్బందితో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపినారు .వివిధ డిపార్ట్మెంట్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరినారు. ఒక సంవత్సరము నుండి రెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు సగం టాబ్లెట్ చూర్ణం చేసి నీళ్లలో వేసి త్రాగించాలని, రెండు సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్తి ట్యాబ్లెట్ నమిలి మింగాలని కోరినారు. పిల్లలలో నులిపురుగులు శరీరంలో ఉండడం వలన వారి శారీరక, మానసిక అభివృద్ధి జరగకపోవడం, నీరసంగా, రక్తహీనతతో చదువుపై శ్రద్ధ లేకపోవడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి మండల స్థాయిలో ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ,సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా సభ్యులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, టీచర్లు, సిడిపిఓలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ,ఎన్జీవోస్ మొదలగువారు ప్రజలలో అవగాహన కల్పించాలని జాతీయ నులిపురుగుల కార్యక్రమమును విజయవంతం చేయాలని కోరినారు .
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్ డాక్టర్, మోహన్ సింగ్ ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్చన, డాక్టర్ రవీందర్, డాక్టర్ విజయకుమార్, డబ్ల్యూహెచ్ఓ సర్వేలెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అతుల్, వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ,సూపర్వైజర్లు పాల్గొన్నారు.