- Advertisement -
యువత బ్రెయిన్ గెయిన్ చేయడానికి కృషిచేస్తాం
We strive to gain the brain of the youth
నాకంటే ఉన్నతస్థాయికి చేరేలా తీర్చిదిద్దుతా
విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికర సమాధానాలు
అమరావతి
రాష్ట్రంలో ఏర్పాటుకు అవసరమైన ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం, యువత బ్రెయిన్ గెయిన్ చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.
- Advertisement -


