Sunday, September 8, 2024

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించదాన్ని స్వాగతిస్తున్నాం

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించదాన్ని స్వాగతిస్తున్నాం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌
హైదరాబాద్‌ డిసెంబర్ 27
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీకలవడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన స్పందర్భంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాలా సార్లు కేసీఆర్ మోదీని కలిశారు. కేసీఆర్ ప్రధానిని కలిసిన ప్రతిసారి చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే మరోసారి కాంగ్రెస్ పార్టీ అవే లేఖలను మోదీకి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో ఎన్నోసార్లు పార్లమెంట్‌లో మాట్లాడామని గుర్తు చేశారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు.
ఎయిమ్స్ వచ్చిందే బీఆర్ఎస్ వల్ల..
ఇవ్వాళ బీబీనగర్‌లో ఎయిమ్స్ వచ్చింది అంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీనేని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదన్నారు. మీరు మాత్రం నవోదయ విద్యాలయం కావాలని మోదీని అడగలేదు. సైనిక్ స్కూల్ మేము అధికారంలో ఉన్నప్పుడు అడిగినం ఇస్తామని ఇచ్చారు. వరంగల్‌లో భూ సేకరణ చేశాం. ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వదు మొత్తం మీరే చూసుకోవాలని చెప్పినట్లు వివరించారు. అలాంటిప్పుడుసైనిక్ స్కూల్ కోసం కొత్తగా అడగవల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందని తెలిపారు.బుల్లెట్ ట్రైన్‌లు అన్ని నార్త్ స్టేట్ లకు ఇచ్చారు. హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగాం, మీరు మాత్రం ప్రస్తావించలేదని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పినవి, చెప్పనవి వాటి కోసం ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. మేము ఎక్కడ తత్సారం చెయ్యలేదు. కేసీఆర్ వందల లేఖలు మోదీకి రాసినా పట్టించుకోలేదు. అందుకే మేము అప్పటి నుంచి ప్రధానిని కలువలేదని స్పష్టం చేశారు.గా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే మరోసారి కాంగ్రెస్ పార్టీ అవే లేఖలను మోదీకి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో ఎన్నోసార్లు పార్లమెంట్‌లో మాట్లాడామని గుర్తు చేశారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్