Friday, November 22, 2024

పోలవరం పూర్తి చేస్తాం – 365 రోజులు రైతులకు అండగా నీళ్ళు పారిస్తాం

- Advertisement -

పోలవరం పూర్తి చేస్తాం – 365 రోజులు రైతులకు అండగా నీళ్ళు పారిస్తాం
చింతమనేని ప్రభాకర్ భరోసా
పెదవేగి, ఏప్రిల్10
రాబోయే ఎన్నికలలో NDA కూటమి అధికారంలోకి రావడం తధ్యం అని, పరిపాలన అవగాహన లేని వైసిపి ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్ట్ ని తిరిగి తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని, 365 రోజులు రైతుల కోసం నీళ్ళు పారేల చేస్తామని టిడిపి జనసేన బిజెపి కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దెందులూరు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా వైసిపికి కంచుకోటగా నిలిచిన మేదినరావు పాలెం గ్రామానికి చెందిన దాదాపు 50 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికారం అంటే చింతమనేని ప్రభాకర్ లాగా ప్రజల పట్ల ఎంతో భాధ్యత గా భావించాలి కానీ, దెందులూరులో వైసిపి నాయకులు మాత్రం తమ అహంభావంతో చేస్తున్న అక్రమాలు, అవినీతి పాలనను చూసి సహించలేకే తామంతా వైసిపి పార్టీని వీడి చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు మెదినరావు పాలెం గ్రామస్థులు తెలిపారు. దుగ్గిరాలలోని నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “మేధినరావు పాలెంలో ఆధిక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కాలంగా వేచి చూస్తుందని, ఈరోజు ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి టిడిపి పార్టీలో చేరటం ప్రజల్లో వైసిపి పాలనపై ఉన్న వ్యతిరేకతకు, NDA కూటమిపై ఉన్న విశ్వానికి ప్రతీక అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తమ కూటమిపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి గర్వపడుతున్నాము అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైసిపినీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, వారికి అన్ని విధాల అండగా ఉంటూ తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పిస్తామని చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూటమి లోని ఇతర పార్టీల వారితో కూడా సమన్వయం చేసుకుని సమిష్టిగా కృషి చేయాలని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సమిష్టి కృషి ఎన్నికల్లో గెలుపు కోసమే కాకుండా ఎన్నికల తర్వాత గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోకూడా కొనసాగాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. మేధినరావు పాలెంలో రంగయ్య భూమిని కొనుగోలు చేసి పూర్తి నివాస యోగ్యంగా ఉండేలా అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికీ 2సెంట్లు స్థలం ఉచితంగా అందిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
నీరు లేక ఎండి పోతున్న చెరువులకు నీళ్ళు అందిస్తామని, వైసిపి హయాంలో జరిగిన అవకతవకలపై చట్టప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు గారపాటి రంగయ్య, తానంకి శరత్ కుమార్, తానంకి రాధాకృష్ణ (పండు), తానంకి సత్యనారాయణ (కొండ), కొమ్మన మురళి కృష్ణ, కొమ్మన ప్రసాద్ ,గూడపాటి భీష్మ, సరిపోల్ల రంగారావు, గూడపాటి చిన్న భీష్మ, తాళ్లూరి రమేష్ తదితర నాయకులను చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇంచార్జీ పరసా వెంకటరావు సహా పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్