Sunday, September 8, 2024

తెలంగాణలో మేం పోటీ చేస్తాం: టీటీడీపీ

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 16, (వాయిస్ టుడే): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని తాను కలిశానని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి వివరించానని కాసాని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు.పలు కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… ‘టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో శనివారం ములాఖత్‌ అయ్యాం. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆయనకు వివరించాం.

we-will-contest-in-telangana-ttdp
we-will-contest-in-telangana-ttdp

చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై దేశం వ్యాప్తంగా గా ఆందోళన ఉంది. బాబు ఆరోగ్యం గురుంచి అరా తీసి బాగోగులు అడగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంలో, రాజకీయ పరంగా బుధవారం క్లారిటీ వస్తుంది. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాటిని మేం ఖండిస్తున్నాం’ అని అన్నారు.‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మా కంటే బలంగా ఉందనేది మేము నమ్మడం లేదు. జనసేనతో ముందుకు వెళ్లాలా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. జాతీయ అధ్యక్షులు అక్రమ అరెస్ట్ విషయంలో అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లిస్ట్ సహా మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. తెలంగాణలో అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో ఉంటుంది’ అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.చవకైన, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ విధానం, ఉపయోగించిన సాంకేతికత పంచుకోవాలని నాసా అధికారులు కోరినట్లు సోమనాథ్ చెప్పారు. అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగల సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్ చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు అవకాశాలు కల్పించారని అన్నారు. భారత్ సాంకేతిక సత్తా ఆ స్థాయికి చేరుకుందన్నారు. చెన్నైలో అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సంస్థలు రాకెట్‌లను తయారు చేస్తున్నాయని.. ఇలా దేశంలో 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కలలు కనడం అత్యంత శక్తివంతమైన సాధనమని సోమనాథ్ అన్నారు. ఎవరికైనా కలులు ఉన్నాయా..? ఎవరైనా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..? పిల్లల్ని ప్రశ్నించారు. చంద్రయాన్ 3 విజయవంతం అయినప్పుడు చంద్రుడిపైకి భారతీయులను ఎప్పుడు పంపుతారని ప్రధాని నరేంద్ర మోదీ అడిగారని తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ఆ పని చేస్తారని.. ఆ రాకెట్‌ను తయారు చేస్తారని విద్యార్థులను ఉద్దేశించి సోమ్‌నాథ్ అన్నారు. చంద్రయాన్‌ 10 ప్రయోగంలో ఇక్కడ ఉన్న వారిలోని ఒకరు రాకెట్‌లో చంద్రుడిపైకి వెళ్తారని, అందులో చాలా వరకు మహిళ వ్యోమగామే ఉండొచ్చని ఆయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్