రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం..
We will cooperate with the state government in all ways.
మా సమస్యలు, పదోన్నతుల అమలులోసహకరించండి..
ఏపీ ఖజానా, లెక్కల శాఖ సంఘం రాష్ట్ర కమిటీ నూతన
అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, రాజ్ కుమార్ వెల్లడి..
తిరుపతి
రాష్ట్ర నూతన ప్రభుత్వానికి తమ సంఘం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తమ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ ఖజానా లెక్కల శాఖ సంఘం రాష్ట్ర కమిటీ నేతలు పేర్కొన్నారు తిరుపతిలోని కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేటు హాల్లో అమరావతి, విజయవాడ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ఆయా జిల్లాల కమిటీల నేతలు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలను శాఖ ఉద్యోగుల ఐక్యతతో పరిష్కరించుకొని పదోన్నతులను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షులు గోవిందు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కాజా రాజ్ కుమార్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రవికుమార్, రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వ ఆర్థిక శాఖలో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఖజానా, లెక్కల శాఖలో ఆఫీసు సబర్డినేట్ స్థాయి నుండి రాష్ట్రస్థాయి కేడర్ అధికారుల వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘం సమిష్టి అభివృద్ధికి, హక్కుల సాధనకు పాటుపడే విధంగా పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు.రాబోయే కాలంలో శాఖ పురోగాభివృద్ధికి, ఉద్యోగుల సమస్యలను ప్రధాన అంశాలుగా తీసుకొని పెండింగ్ లో ఉన్న పదోన్నతులపై ప్రత్యేక దృష్టి సారించి ,అన్ని కేటగిరీల ఉద్యోగులకు అర్హత ఉన్న మేరకు పదోన్నతులు కల్పించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షులుగా కె. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కరిముల్లా, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి. శ్రీనివాసరావు, కోశాధికారిగా యుగంధర్ తో పాటుగా 7 మంది ఉపాధ్యక్షులను, 7 మంది కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.