- Advertisement -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగడతాం
We will dry up the Congress party that cheated the farmers
నర్సంపేట
ఆరు గ్యారంటీలు, రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నదని బి, ఆర్, ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలమేరకు సోమవారం పట్టణంలోని వరంగల్ రోడ్ సెంటర్లో,దుగ్గొండి మండలం వరంగల్ ప్రధాన రహదారి గిర్ని బావిలో పార్టీ శ్రేణులు, రైతులతో ధర్నా చేశారు. ధర్నా సందర్బంగా ప్రజల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. గిర్ని బావిలో గంటపాటు రాకపోకలు నిలిచి పోయాయి. నర్సంపేటలో ఎస్.ఐ రవి కుమార్, అరుణ్ దుగ్గొండి ఎస్ ఐ ధర్నా కార్యక్రమాన్ని విరమింప చేశారు.అనంతరం నర్సంపేటలో అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, గిర్ని బావిలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓట్ల కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాకింద ఎకరాకు 7500 సంవత్సరానికి 15 వేలు ఇస్తామని 12 వేలు ఇవ్వడం మోసం కదా అంటూ విమర్శలు చేశారు. రైతు కూలీలకు, కౌలు రైతులకు అనేకహామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ మాజీ కౌన్సిలర్స్ మండల. శ్రీనివాస్, పుల్లూరి స్వామి, దుగ్గొండిలో ఎన్, ఆర్, ఐ శానబోయిన రాజే్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -