ఎల్బీనగర్, వాయిస్ టుడే:
కాంగ్రెస్ పార్టీలో మహేశ్వరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడిన కొత్త మనోహర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడి, ఆ ధనాన్ని ఎన్నికలలో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇళ్లు లేని నిరుపేదలకు 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను ఇస్తానని హామీనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి బీఎస్పీ గెలుపొందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బహుజనులు కృషి చేయాలని ఆయన కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు