దివ్యాంగుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తాం…..
We will provide complete support for the development of the disabled.
– ఎమ్మెల్యే విజయ రమణ రావు
పెద్దపల్లి ప్రతినిధి:
దివ్యాంగుల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు, *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షలు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పెరేడ్ గ్రౌండ్స్ లో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు 27 లక్షల విలువ గల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నవంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా క్యాంప్ నిర్వహించి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన దివ్యాంగుల ను ఎంపిక చేసామని , ఎంపిక కాబడిన దివ్యాంగులకు నేడు 27 లక్షల విలువ చేసే వివిధ ఉపకారణాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగు తుందని అన్నారు. రాబోయే 2 నెలల వ్యవధిలో మరొకసారి క్యాంపు నిర్వహించి ఇంకా ఎవరైనా దివ్యాంగులు పెండింగ్లో ఉంటే వారిని గుర్తించి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాలను ఆర్.బి.ఎస్.కే బృందాలు పర్యటిస్తూ పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారని, ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించ డం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చిన్నపిల్లల ఎదుగుదల సమస్యలను గుర్తించేందుకు మన పెద్దపల్లి జిల్లా మాత శిశు ఆసుపత్రిలో డి.ఈ.ఐ.సి సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. జిల్లాలో వినికిడి సమస్య ఉన్న పిల్లలను గుర్తించామని వారికి త్వరలోనే ఉచితంగా వినికిడి యంత్రాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల జీవనోపాధి కోసం వ్యాపార యూనిట్ల స్థాపనకు రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, ప్రజాప్రతి నిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.