వచ్చే జనవరి నెల 5 నాటికి 4 లేఅవుట్లకు, సంక్రాంతి నాటికి రెండు లేఔట్ల ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తాం
We will provide copies of proceedings to beneficiaries for 4 layouts by 5th January and two layouts by Sankranti.
శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం…
ఎలాంటి అపోహలు వద్దు:
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:
డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది::
ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు
తిరుపతి,
దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో చర్యలు చేపట్టామని, వచ్చే జనవరి నెల 5 నాటికి 4 లేఅవుట్లకు, సంక్రాంతి నాటికి రెండు లేఔట్ల ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని ఎలాంటి అపోహలు వద్దని, శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు.
సోమవారం ఉదయం తిరుపతి నియోజకవర్గం శెట్టిపల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు తిరుపతి ఎంఎల్ఏ, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
శెట్టిపల్లి సాధన సమితి వారు, పలువురు ప్రజలు, సంఘాల నాయకులు శెట్టి పల్లి భూసమస్యలపై పలు అంశాలు జిల్లా కలెక్టర్, ఎంఎల్ఏ దృష్టికి తీసుకుని వచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 6వతేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకూ 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని,తక్కువలో తక్కువ అంటే 1.5 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతోందన్నారు. కలెక్టర్ తాను బాధ్యతలు స్వీకరించినప్పటినుండి సుమారు నాలుగైదు సార్లు శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం పై పలుసార్లు సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే గత కలెక్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి సెక్రటరీ ప్రద్యుమ్న ఈ మధ్యనే శ్రీకాళహస్తి నందు నిర్వహించి సమావేశంలో శెట్టి పల్లి భూ సమస్యల పరిష్కార దిశగా చర్చించడం జరిగిందని వారు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. శెట్టిపల్లి భూములకు సంబంధించి మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ రెండు శాఖల మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ గా తాను, ముఖ్యమంత్రి సెక్రటరీరు కలిసి పది రోజులలో సంక్రాంతికి మునుపే సమావేశం నిర్వహించి ప్రతిపాదనలను క్యాబినెట్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. 12 పెండింగ్ లేఔట్లలో జనవరి 5వ తేదీ కల్లా నాలుగు లేఔట్ల ప్రొసీడింగ్స్ సంబంధిత లబ్ధిదారులకు అందిస్తామని, అలాగే మిగిలిన రెండు పెండింగ్ లేఅవుట్లను సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందిస్తామని తెలిపారు. జనవరి 30 నాటికి అధికారికంగా పేపర్ మీద లేఔట్ ప్లానింగ్ చేసి ప్లాట్లను లబ్ధిదారులకు చూపడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లాకు వచ్చినప్పుడు శెట్టిపల్లి భూములకు సంబంధించిన సమస్యపై పరిష్కారానికి దిశా నిర్దేశనం చేశారని లే అవుట్లను త్వరితగతిన చేయాలని సూచించారని గుర్తు చేశారు. అలాగే పలువురు శెట్టిపల్లి లో డ్రైనేజీ నిర్వహణ, పారిశుధ్యం, వీధి దీపాలు అంశాలపై సమస్యలు తెలపగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ను పరిశీలించవలసిందిగా కలెక్టర్ సూచించారు. ఎంజాయ్ మెంట్ లో ఉన్న వారికి ఒకటిన్నర సెంటు భూమి అందిస్తామని ఆయన తెలిపారు. మల్టిపుల్ రిజిస్ట్రేషన్ లు ఎన్ని జరిగాయో రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అబ్జెక్షన్ పోరంబోకు లో ఉన్న వాటిని అనుమతించలేమని స్పష్టం చేశారు.
ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ శెట్టిపల్లి సమస్య సుమారు 60 సంవత్సరాలపైగానే ఉన్న సమస్య అని 2014-19 సంవత్సరం మధ్యలో టిడిపి ప్రభుత్వం శెట్టిపల్లి భూములపై జీవో ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించారని ఇక్కడ సమస్యలు వారికి అవగాహన ఉందని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. చిత్తశుద్ధి కలిగిన కలెక్టర్, అధికారులు ఉన్నారని ఇప్పటికే 1410 మందికి ఇంటి స్థలాలు 74.31 ఎకరాలు ఇచ్చారని, 248 మంది రైతులకు వ్యవసాయ భూములు 137.18 ఎకరాలు, 48 మందికి మెట్ట భూములు 46.55 ఎకరాలు ఇచ్చారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రంగం విశేష కృషి చేస్తున్నారని అన్నారు. శెట్టిపల్లి భూములు చాలా విలువైనవని ఇక్కడ జనాభా ఎక్కువగా ఉందని, శెట్టిపల్లి అభివృద్ధికి నారా లోకేష్ గారు 147 ఎకరాలలో ఐటి హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తద్వారా భూముల విలువ పెరుగుతుందని, స్థానిక యువతకు మంచి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చిత్తశుద్ధితో అధికారులకు సూచనలు ఇస్తూ త్వరితగతిన పరిష్కారానికి చొరవ చూపుతున్నారని ప్రశంసించారు.
అనంతరం ప్రజల నుండి కలెక్టర్, ఎంఎల్ఏ, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఆర్ ఐ రామ చంద్ర రెడ్డి, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.