Sunday, September 8, 2024

చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం.

- Advertisement -

చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం.
— ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి;ఏప్రిల్ 20(వాయిస్ టుడే)
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ణచేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాంమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు శ్రీ హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ముక్తకంఠంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి విధివిధానాల పై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుక గా ఇస్తామన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని, ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొం టుందని, కేసీఆర్ ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కు వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని, బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టడం జరిగినదని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి, సమిష్టి కృషి తో పని చేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దామని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి , మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, బిఎస్ఎఎన్ కిరణ్ యాదవ్, రాజు నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాల హరీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,నాయి నేనీ చంద్రకాంత్ రావు, భిక్షపతి ముదిరాజు, మోహన్ ముదిరాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, చిన్న మధుసూదన్ రెడ్డి, సంతోష్ రావు, జోగిపేట్ భాస్కర్, పోతుల రాజేందర్, జోగిపేట్ బాలరాజు, కాశినాథ్ యాదవ్, నిమ్మల రామ కృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, కిషన్, ఎల్లం నాయుడు, జమీర్, సబీర్, కాసాని శంకర్,రాజయ్య, గోపాల్ యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్,మంజుల , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్