Saturday, February 14, 2026

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల ,  పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపిస్తాం .

- Advertisement -

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల ,  పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపిస్తాం .

We will waive income tax on the dream of own house and perks of Singareni workers.

4 వ తేదీన పెద్దపల్లి లో జరిగే (ముఖ్యమంత్రి)  యువ వికాసం సభ కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి.

– జీడీకే 11 ఇంక్లైన్ గెట్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐ న్ టి యూ సి సెక్రటరీ జనరల్  జనక్ ప్రసాద్ .
గోదావరిఖని:

గోదావరిఖనిలోని  స్థానిక ఆర్జీ-1 జీడీకే 11 ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు
ఐన్టియూసి సెక్రటరీ జనరల్  జనక్ ప్రసాద్
మాట్లాడుతూ..

సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన కార్మికుల సొంత ఇంటి కల ,  పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ గురించి ప్రభుత్వ తో మాట్లాడటం జరిగిందని త్వరలోనే ఆచరణ కాబోతుందని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యంగా కార్మికుల కృషి వల్ల ఎన్నడూ లేని విధంగా సింగరేణి లో అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదక మరియు లాభాలు గడించిందని. ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35-40 ఏళ్ల పెంపు , రామగుండం లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్లు , ఒడిసా లో నైని ప్రాజెక్టు నిర్మాణం , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు , కోటి రూపాయల ప్రమాద భీమా , స్థానికులకే 80% ఉద్యోగాలు , సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకం  వంటి అనేక కార్యక్రమాలు చెప్పటామని సింగరేణి కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ 796 కోట్లు లాభాలు ఇవ్వటం తో పాటు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క  ,  ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి   శ్రీధర్ బాబు  కృషి పలితంగా కాంట్రాక్టు కార్మికుల కి కూడా లాభాలలో నుండి 5000 రూపాయలు ఇప్పించామని. అలాగే భవిష్యత్ లో కూడా రామగుండం లో 1000 క్వార్టర్లు తో గేటెడ్ కమ్యూనిటీని తరహా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.
సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి గార్లు మాట్లాడుతూ ..
ఏఐటీయూసీ గుర్తింపు సంఘం పూర్తి గా విఫలమైంది అని, ఒకప్పుడు పోరాటాలు చేసే నాయకులు ఉంటే ఇప్పుడు పైరవీల కోసం ఆరాటే పడే నాయకులు ఉన్నారని మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఒక్క డిమాండ్ కూడా అగ్రిమెంట్ చేయకుండా సూచన ప్రాయంగా అంగీకరించారని తెలపటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. జీడీకే 11 ఇంక్లైన్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్మికులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.
ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం గారి అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో  సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి ,ధర్మపురి,
జనరల్ సెక్రటరీలు వంగ లక్ష్మిపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్, నాయకులు లింగస్వామి , జాయింట్ జనరల్ సెక్రటరీ లు గడ్డం కృష్ణ, బత్తుల పోచయ్య, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ పోతరబోయిన సమ్మయ్య యాదవ్,
సెంట్రల్ సెక్రటరీ లు మోసిన్, పుట్ట రమేష్, మండ రమేష్,బ్రాంచ్ సెక్రటరీలు గుండేటి శ్రీనివాస్, ఎదులాపురం శ్రీనివాస్ ,
పిట్ సెక్రటరీ  గాదె సంపత్, అల్లావుద్దీన్, తాటి రాజయ్య, సంపత్, రామస్వామి, కుమారస్వామి, హేమంత్,రాకేష్, ఆంజనేయులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్