ఏప్రిల్ 9న ఉగాది కాబట్టి హాలి డే. మత పెద్దల నిర్ణయాన్ని బట్టి ఒకటి, రెండు రోజులు అటూ ఇటూగా రంజాన్ సెలవు ఉంటుంది. ఏప్రిల్ 17న రామనవమి సందర్భంగా సెలవు ఉంటుంది. వీటికి రెండవ శనివారం, ఆదివారం సెలవులు కూడా యాడ్ అవ్వనున్నాయి.ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. విద్యార్థులు ఆరోగ్యం దృష్ట్యా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నాయి. ఈ సారి ఎండలు తీవ్రత అధికంగా ఉండబోతుందన్న వాతావరణ శాఖ సూచనలు పరిగణలోకి తీసుకుని.. ప్రభుత్వాలు రివ్యూ చేసి సమ్మర్ హాలిడేస్ కూడా త్వరగానే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఏప్రిల్ నెలలో స్కూల్స్, కళాశాలలకు వరుస సెలువులు రానున్నాయి
ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఫెస్టివల్స్ నేపథ్యంలో వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవలు రానున్నాయి. వీటితో పాటు.. సెకండ్ సాటర్ డే, సండే కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 మధ్య స్కూళ్లలకు వరసగా సెలవులు రానున్నాయి. తెలంగాణ ఈసారి వేసవి సెలవులు.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక హోలీ నేపథ్యంలో మార్చి 25న కూడా తెలంగాణ సర్కార్ సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈసారి ముందుగానే ఇంటర్ రిజల్ట్స్…తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఎగ్జామ్స్ అయిపోవడంతో.. జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ ప్రక్రియ షురూ కాగా.. పేపర్ వాల్యూయేషన్ వేగంగా జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా కంప్లీట్ చేసి, ఫలితాలు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ మూడోవారం లేదా నాల్గవ వారం ఇంటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.