మహా పాదయాత్రికునికి ఘన స్వాగతం

- Advertisement -

మహా పాదయాత్రికునికి ఘన స్వాగతం

Welcome to the Maha padayatra

కమాన్ పూర్
మహాపాదయాత్రికుని కి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో సోమవారం ఘన స్వాగతం లభించింది.
అయ్యప్ప మాల ధరించి 48 రోజుల పాటు మహా పాదయాత్ర ద్వారా అయ్యప్పను దర్శించుకుని వచ్చిన మండలంలోని రత్నాపూర్ గ్రామ ఎక్స్ ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్ కు గ్రామస్థులు, అయ్యప్ప భక్తులు సోమవారం ఘన స్వాగతం పలికారు. ముందుగా మారుతినగర్ హనుమాన్ దేవాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శాలువా, పూలమాలతో సంపత్ ను సత్కరించారు. యువతల్లో భక్తి భావం పెంపొందించేందుకు సంపత్ చేపట్టిన మహా పాదయాత్ర స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతరం సెంటినరీకాలనీ మీదుగా రత్నాపూర్ రామాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా దారిపొడవునా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం గ్రామస్థులు, బీఆరెస్ నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, బీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు శెంకేషి రవీందర్, రైతుబంధు అధ్యక్షుడు మేదరవేన కుమార్ యాదవ్, బీఆరెస్ పట్టణ అధ్యక్షుడు కాపురవేన భాస్కర్, స్థానిక మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, నాయకులు స్థాలిన్, అశోక్,  మేడగొని రాజన్న, బుద్దె ఉదయ్, కుమారస్వామి, బాద్రపు ప్రశాంత్, వేగోలపు మల్లయ్య, రొడ్డ శ్రీనివాస్, మట్ట రాజు, ఆసం తిరుపతి, ఎలువాక సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular