34.8 C
New York
Saturday, June 22, 2024

పెన్ మహోత్సవ ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం*

- Advertisement -

Welcome to the Penn Festival*పెన్ మహోత్సవ ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం*

*అది 28వ నవంబర్ 2021-ఒక ఆలోచన ఇంతటి నెట్వర్క్ సాధించడానికి నాంది పలికింది*

*ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో మార్కింగ్ వేసి అంటే పురుడు పోసుకుని*

*రూట్స్ కొలెజ్యంలో వేర్లు నాటి అంటే పునాదులు బలంగా చేసుకుని*

*ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్లో అడుగులు వేస్తూ*

*విహెచ్ఆర్ బ్యాంకవెట్ హోల్ లో వనితలకు మహిళా దినోత్సవ జేజేలు పలుకుతూ*

*కరీంనగర్ వి- పార్క్ లో కదం తొక్కుతూ*

*మళ్లీ ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ*

*మొదటిసారిగా జిల్లాలతో వాణిజ్య సత్సం బంధాలు అల్లుకునే ప్రయత్నంలో మనసున్న మంచిర్యాల్ లోని రామసుధ రెసిడెన్సిలో పలకరిస్తూ*

*కూకట్పల్లిలోని లోటస్ హాల్లో ఎన్నారైల సలహా సూచనలు పాటిస్తూ*

*ఓరుగల్లు సైని గార్డెన్స్ లో వేయి స్తంభాల సాక్షిగా సదస్సు నిర్వహించి*

*నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అనుక్షణం ఉత్కంఠ గా సాగిన, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్, ఇంటర్ ప్రీవియస్ పటేల్ లీగ్ ఈపిఎల్ మ్యాచ్ ఆట విడుపుతో*

*నిజామాబాద్ బృందావన్ లో నిజమైన పటేల్స్ ని కలుస్తూ*

*సికింద్రాబాద్ సప్తగిరి లో షేక్ హాండ్స్ చేస్తూ*

*సప్త సముద్రాలు, అనంత పర్వతాలు ఆకాశమార్గాన ధాటి దుబాయ్ పటేల్తో దుబాయ్ లోని షేర్టన్ డౌన్ టౌన్ హాల్లో ధూమ్ దాంగా అంతర్జాతీయ పెన్ సదస్సు నిర్వహించి*

*వి హెచ్ ఆర్ బ్యాంక్వత్ హాల్లో మరోసారి వనితలకు వందనాలు సమర్పిస్తూ*

*ఆధ్యాత్మికతను మదిలో స్మరిస్తూ, యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో, మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో 100 సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి*

*చిన్నారుల జ్ఞాన /విజ్ఞాన/ పరిజ్ఞానకు బాటలు వేస్తూ సాలార్జంగ్ మ్యూజియంలో వింతలు చూపిస్తూ*

*జిఎన్ఎస్ గ్రాండ్ లో పదునైన 18వ సదస్సు నిర్వహించి*

*రూట్స్ కాలేజ్యం లో చిన్న తరహా, స్టార్టప్ పరిశ్రమల సహకారం పై అవగాహన సదస్సు నిర్వహించి*

*చలో ఆదిలాబాద్ అనే నినాదంతో సిరి బ్యాంక్వైట్ హాల్లో సమావేశపరిచి*

*ఏటీసీ కూకట్పల్లిలో అందరిని కలుపుకుని*

*వేములవాడ రాజన్న సన్నిధిలో మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవనంలో వెన్నంటి ప్రోత్సహించే పటేల్స్ తో చర్చించి*

*మరిచిపోలేని ముంబై మున్నూరు వారు సాహిత్యంతో*

*కామారెడ్డి పాలిక ప్యాలెస్ లో కుతూహలంగా సదస్సు నిర్వహించి,*

*కార్ఖానా ఎన్గ్రాండ్ లో నైపుణ్యాభివృద్ధికి నగరా మ్రోగిస్తూ*

*వి హెచ్ ఆర్ బ్యాంక్పెట్ హాల్లో మూడోసారి శక్తి స్వరూపిణిలుగా పరిగణిస్తున్న వనిత శక్తి సదస్సుతో*

*చందానగర్ లోని క్రిస్టల్ గార్డెన్స్ లో రియల్ గా రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసి*

*పెన్ యొక్క సభ్యులు వ్యాపార పరిచయాలతో కోట్ల కొద్ది వ్యాపార లావాదేవీలతో పాటు ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నారు*

*ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 28వ సదస్సును వ్యాపార ప్రదర్శన సదస్సుగా, 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి, పదివేలు పైగా సందర్శకుల సందడితో, 100కు పైగా నిరంతరం సైనికులుగా సేవలందిస్తున్న వాలంటీర్స్ తో, నోరూరించే అభిరుచులతో, గంట గంటకు లక్కీ డ్రాస్ నిర్వహిస్తూ, మీ అందరిని ఉత్సాహ పరుస్తూ వినోదాన్ని అందిస్తూ, చిన్నారులకు ఆటువిడుపుగా ప్లీజ్ జోన్ ఏర్పాటుచేసి, అనంతరం బంపర్ ప్రైస్ తొ, ప్రతిభకు పట్టం కట్టే విధంగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లాంటి విన్ను కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్న పటేల్ ఎంటర్ప్రైనియర్స్ నెట్వర్క్*

*ఇంకా ఎంతో సాధించాలన్న తపన, అందరినీ కలుపుకుపోవాలన్న దృఢ సంకల్పం, తగ్గని ఆత్మవిశ్వాసం- మీ అందరి శుభాఆశీస్సులు/ శుభాకాంక్షలతో పెన్ నిరంతరం సరికొత్త కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తుందని వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాము*

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!