సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
హైదరాబాద్
Welfare schemes should be taken to the people.
గాంధీ భవన్లో వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గోన్నారు. సీఎం సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు టీపిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తల్లో నైరాశ్యం చెందిన మాట వాస్తవం – త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు వుంటాయి. 17 నెలల పాలనలో ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలపై ప్రభావం ఉండే అవకాశం వుంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇంచార్జ్గా రావడం మనందరి అదృష్టం. * చురుకైన నాయకుల్ని పీసీసీ అబ్జర్వర్లతో గుర్తించి తగిన ప్రాధాన్యం వుంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపై ఉంది. కార్యకర్తలు – నాయకులు ప్రజలతో అనుసంధానంగా పని చేయాలి, పార్టీకి ప్రభుత్వానికి నాయకులు వారధిగా పనిచేయాలి. సీనియర్, జూనియర్ల సమన్వయంతో పని చేయాలి. కులసర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూ భారతి పట్ల ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా పథకాల అమలుచేస్తున్నాం. * స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.


