Wednesday, January 22, 2025

ఆకలి సంగతి ఏంటీ…

- Advertisement -

ఆకలి సంగతి ఏంటీ…

What about hunger...

మెదక్, జనవరి 8, (వాయిస్ టుడే)
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థులు అర్థాకలి మధ్య చదువును కొనసా  మెదక్ జిల్లా వ్యాప్తంగా 225 ఉన్నత పాఠశాలల్లో 10,389 మంది విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రతీరోజు ఉదయం 8:15 గంటలకు ప్రత్యేక తరగతులు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగుతున్నాయి.ఉదయం 8 గంటల వరకే పాఠశా  విద్యార్థులు చేరుకుంటున్నారు. గ్రామా  నుంచి వేలాది మం  విద్యార్థులు ఆయా పాఠశాలలకు పదవ తరగతి చదివేందుకు వస్తున్నారు. ఉదయం త్వరగా వెళ్లాల్సి ఉండటతో ఇంటి వద్ద ఏమీ తినకుండానే పాఠశా  వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.పాఠశాలలో మధ్యా  12.30 గంటల వరకే మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకుంటున్నారు. తిరిగి తరగతులకు హాజరుకావడం, సాయం  5.30 గంటల వరకు చదువులు కొనసాగించడంతో నీరసించిపోతున్నారు. ఉదయం, సాయంత్రం ఫలహారం లేకపోవడంతో చదువుపై శ్రద్ధ కనబర్చడం లేదని వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేక తరగతులకు గాను ఫలహారాన్ని అందించేవారు. అయితే ఏడాది నుంచి విద్యార్థులు ఫలహారానికి నోచుకోవడం లేదు. మరో 53 రోజుల్లో పదవ తరగతి  పరీక్షలు సమీపిస్తుండగా ఏకాగ్రత లోపించి అనుకున్న ఫలితాలను సాధించలేకపోతారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నిధులు మంజూరు చేయించి విద్యార్థులకు ఫలహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఫలహారం అందించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో జిల్లా కలెక్టరే తన నిధుల నుంచి ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పున కేటాయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం కలెక్టర్ వద్ద ఎలాంటి నిధులు లేవని, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఖర్చయినట్లు సమాచారం. జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఫలహారం అందించేందుకు గాను ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకువచ్చి విద్యార్థుల ఆకలిని తీర్చాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ఉపాధ్యాయులు కోరుతున్నారు.పదవ తరగతి ప్రత్యేక తరగతుల కోసం ప్రతిరోజు ఉద  4 కిలో మీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్నా. ఉదయం తొందరగా రావాల్సి ఉండటంతో ఇంట్లో తినకుండానే రావడంతో ఆకలితో చదువుకు ఆటంకం కలుగుతోంది. సాయంత్రం వరకు ఆకలిని తట్టు  చదవాల్సి వస్తుంది. ఉదయం, సాయంత్రం ఫలహారం అందిస్తే బాగుంటుంది.ఉదయం నుంచి సాయం  వరకు ప్రత్యేక తరగతులు ఉండటం వలన అల  గురవుతున్నాం. సా  4 గంటలకు అల్పాహారం ఉంటే బాగుంటుంది. చాలామంది గ్రామా  నుంచి కాలినడకన వస్తున్నారు. మా అవస్థను అర్థం చేసుకొని దాతలు, అధికారులు అల్పాహారం అందించేలా చర్య  తీసుకోవాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్