Thursday, April 10, 2025

రేవంత్ లెక్కేంటో…

- Advertisement -

రేవంత్ లెక్కేంటో…

What are Revanth calculations...

హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే)
మరో నాలుగేళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన నాలుగేళ్లు చేస్తే మరో పదిహేనేళ్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తారని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ప్రజలు తనకు పదేళ్లు అధికారం ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తన నమ్మకానికి ఆయన ఓ లాజిక్ కూడా చెబుతున్నారు.  బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో  రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా పదేళ్లకు సరిపడా ప్రణాళికలు వేయమని చెప్పానని దాని ప్రకారం ఏం కావాలన్నా చేస్తామన్నారు. ఐదేళ్లే అధికారం కదా పదేళ్లకు ప్రణాళికలు ఎందుకో కూడా రేవంత్ చెప్పారు.  తెలంగాణ సమాజం ఎవరికైనా పదేళ్ల సమయం ఇస్తోందని రేవంత్ చెబుతున్నారు. చంద్రబాబు రెండు  సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్‌కు కూడా రెండు సార్లు గెలిచారు.  తర్వాత కేసీఆర్ కు  కూడా టర్ములు చాన్సిచ్చారని.. ఆలా ఎవరు పదవి చేపట్టినా పదేళ్లు చాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తనకు కూడా రెండు సార్లు చాన్స్ ఇస్తారని రేవంత్ అంటున్నారు. ఆ నమ్మకం తనకు ఉందంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అంశం చూడటానికి బాగుంది. అయితే వారెవరికీ రెండో సారి కావాలని అధికారం ఇవ్వలేదు. వారి పాలనా తీరు చూసే ఇచ్చారని రాజకీయవేత్తలు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో లాజిక్కులకు చాన్స్ లేదు. గత మూడు సార్లు ఒక్కో పార్టీ రెండు సార్లు గెలిపించారని వచ్చే ఎన్నికలలోనూ మరోసారి కాంగ్రెస్ ను గెలిపించాలన్న రూలేం లేదని అంటున్నారు. గతంతో పోలిస్తే రాజకీయాలు మారిపోతున్నాయి.కేంద్రంలో ప్రభుత్వంపై  అసంతృప్తి పెద్దగా పెరగకపోయినా రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలపై అసంతృప్తి పెరగడానికి ఎంతో కాలం పట్టడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి  పదేళ్ల పాటు అధికారంలో ఉండాలన్న సంకల్పం ఉంది. రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా అధికారాన్ని అందుకోవాలనే లక్ష్యం ఉంటుంది. అది అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్న  ఆశయం ఏర్పడుతుంది.  దానికి రేవంత్ రెడ్డి అతీతుడేమీ కాదు. ఆయనకు ఇంకా ప్లస్ పాయింట్ వయసు. యాభైల్లోనే ఆయన చేతికి సీఎం పీఠం వచ్చింది. కావాల్సినంత కష్టపడే ఓపిక ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిందని చెప్పడం కూడా తొందరపాటే. చివరి ఏడాదిలో జరిగే పాలనా పరమైన నిర్ణయాల ఆధారంగానే ప్రజలు ఎక్కువగా ఓటింగ్ ప్రయారిటీ తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది. అందుకే లాజిక్కులకు కాకపోయినా రేవంత్ కు రెండో చాన్స్ లేదని మాత్రం చెప్పలేం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్