కేటీఆర్ నీ గోలేంటి?:బన్నీ లాయర్ శ్రీనివాస్ రెడ్డి
What is KTR's goal?: Bunny Lawyer Srinivas Reddy
హైదరాబాద్:డిసెంబర్ 13
హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకించిన కేటీఆర్, నేరుగా అల్లు అర్జున్ బాధ్యత వహించ కపోయిన అతనిని అరెస్టు చేయడాన్ని తాను ఖండిస్తు న్నట్లు తెలిపారు.
అలాగే హైడ్రా కారణంగా ఇద్దరు మృతి చెందితే, అందుకు కారకులైన సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయా లని పొలిటికల్ కామెంట్ కూడా చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న క్రమంలో కేటీఆర్ ఈ విష యాన్ని కూడా రాజకీయ దురు ద్దేశంతో, ట్వీట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏకంగా బన్నీ లాయర్ శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి, ప్రతి విషయాన్ని రాజకీయ దురుద్దేశంతో చూడడం మానుకోవాలని కేటీఆర్ కు హితవు పలి కారు. తమకు రాజకీయ జోక్యం అవసరం లేదని, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఎటువంటి పొలిటికల్ ఎంట్రీ వద్దంటూ న్యాయవాది సూచించారు.
అలాగే కేటీఆర్ ట్వీట్ కి మద్దతు కంటే, బన్నీ ఫ్యాన్స్ తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.