వైసీపీకి టీడీపీకి ఏంటీ తేడా  

- Advertisement -

వైసీపీకి టీడీపీకి ఏంటీ తేడా  

What is the difference between YCP and TDP?

వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ
విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి, ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కారని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో, మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు.  సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”.  కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్.  విద్యుత్ ఛార్జీల విషయంలో.. ” వైసీపీ చేసింది పాపం అయితే – రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం”.   గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ?  ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ?  5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా?  వైసీపీకి మీకు ఏంటి తేడా ?  వైసీపీ   తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని,  కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.  ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే,  తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే..  వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి.  పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండి.  ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని , కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.  ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో,  అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular