ఇదేం పార్టీ.. చంద్రబాబు ఆశ్చర్యం!

- Advertisement -

ఇదేం పార్టీ.. చంద్రబాబు ఆశ్చర్యం!

అసెంబ్లీని బహిష్కరించడం వైసీపీకి తగదు: సీఎం

What kind of party is this… Chandrababu surprised!

విజయవాడ, ఆగస్టు 19 (వాయిస్ టుడే):
శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

అమరావతిలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి ప్రాధాన్యత ఉంటుందని, సభకు హాజరుకాకుండా బయట మాట్లాడితే పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.

గతంలో తాను అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

గ్రూప్‌-1 వ్యవహారంపై చర్చను తప్పించుకునేందుకే జగన్‌ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. డీఎస్సీ అంశంలోనూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వైసీపీ హయాంలో తగ్గించిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular