- మంత్రి కేటీఆర్ పిలిస్తే వచ్చా ఎమ్మెల్యే రాజయ్య
హైదరాబాద్:జులై : మంత్రి కేటీఆర్ పిలిస్తే ప్రగతిభవన్‌కు వచ్చానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనవసర వివాదాలు వద్దని మంత్రి చెప్పారని, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించక ముందే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారని, నియోజకవర్గంలో తిరుగుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీల పర్యటనలు ఎమ్మెల్యేలను బలోపేతం చేసేదిగా ఉండాలని, కానీ శ్రీహరి పర్యటనలు అలా లేవన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, కడియం మీద తాను చేసినవి అభియోగాలు మాత్రమేనని రాజయ్య పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం జరగిన నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు. అయితే కడియంపై చేసిన వ్యాఖ్యలపై రాజయ్య వివరణ ఇచ్చారు. ఇంకోసారి రిపీట్ కావద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పార్టీ అంతర్గత గొడవల వల్ల ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు రాజయ్య ప్రగతి భవన్‌లో కొద్దిసేపు వెయిట్ చేశారు. అయినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్నా గందరగోళంలో రాజయ్య ఉన్నారు…