కవిత నెక్స్ట్ ఏంటీ…
హైదరాబాద్, జూన్ 7, (వాయిస్ టుడే )ఁ
What's next for Kavitha...
కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్..ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక కచ్చితంగా స్పందిస్తారని కవిత భావించారట.ఒక్క లేఖ. బీఆర్ఎస్‌తో ఆమె బంధంపై సస్సెన్స్‌ను కంటిన్యూ చేస్తోంది. కవిత బీఆర్ఎస్‌లో ఉన్నారా.? వీడారా అన్నది తేలని ప్రశ్నగా ఉంది. ఇదే సమయంలో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిందన్న టాక్ వినిపిస్తోంది. తన అసంతృప్తి గళంతో కేసీఆరే పిలిచి మాట్లాడుతారని ఊహించారట కవిత. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కవిత కామెంట్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని టాక్. ఏదైనా సమస్య ఉంటే డైరెక్టుగా తన దగ్గరకు వచ్చి చెప్పి ఉంటే బాగుండేదని..లెటర్ రాసి రాద్దాంతం క్రియేట్ చేసిందనే ఆగ్రహంతో ఉన్నారట గులాబీబాస్ కేసీఆర్.పార్టీలో లోటుపాట్లపై కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత..తండ్రి కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కామెంట్స్ చేసి పెద్ద చర్చకు దారితీశారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో తేల్చాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది కవిత. ఈ క్రమంలో కవిత ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ జరిగింది. అంతలోనే మళ్లీ రూట్ మార్చిన కవిత… తండ్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిచ్చిన అంశంపై..హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలిపింది. అయితే ఆ ధర్నా చేయడం వెనుక కవిత ప్లాన్ వేరే ఉందని..ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.బీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం లీడర్. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. అలాంటి కేసీఆర్‌కు మద్దతుగా కవిత ధర్నా చేస్తే అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు. కవిత ఇన్వైట్ చేశారో లేదో..లేక ఆమె పిలిచినా ఎవరు రాలేదేమో కానీ..ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా ఆమె నిర్వహించిన ధర్నా వైపు రాలేదు. గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా పోటా పోటీగా వచ్చి అటెండెన్స్ వేయించుకునే గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు మాత్రం మొహం చాటేశారు.అయితే కవిత ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇప్పుడు కేసీఆర్‌కు మద్దతుగా నిర్వహించిన మహాధర్నా మరో ఎత్తని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. తెలంగాణ జాగృతి పేరుతో వందల కార్యక్రమాలు చేసిన కవితకు ప్రతీ సందర్భంలో మద్దతుగా వెంట నడిచింది బీఆర్‌ఎస్ క్యాడర్. ఎక్కడైనా..ఎప్పుడైనా కవితను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. కానీ తండ్రి కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ లీక్ తరువాత సీన్ మొత్తం మారిపోయింది.కేసీఆర్ అంటే బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ అంటే కేసీఆర్. అలాంటి ఆయనకు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు, కండువాలు పెట్టకపోవడమంటే కవిత తనకు తానుగా పార్టీకి దూరం అవుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇన్నాళ్లు కవిత ఏం మాట్లాడినా, లేఖలు రాసినా ఆమె ప్రయాణం మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉంటుందని అనుకున్నారంతా. కానీ రోజు రోజుకు ఆమె తీరు చూస్తోంటే మాత్రం బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకున్నట్టే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ తర్వాత ఆమె అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా బీఆర్ఎస్ జెండా కానీ, ఆ పార్టీ నేతలు గాని ఆమె కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీన్ని బట్టే పార్టీ కవితను దూరం పెట్టేసిందని, ఆమె ఇప్పుడు ఒంటరి అయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కనీసం కవిత పేరే ఎత్తడం లేదంటున్నారు.ఎమ్మెల్సీ కవిత జోలికి ఎవ్వరూ వెళ్దొద్దని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించిందన్న అన్న టాక్ వినిపిస్తోంది. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ నేతలే ఆమెతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇక కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దర్నాకు బిఆర్ ఎస్ కేడర్ పూర్తిగా దూరంగా ఉండటం…ధర్నాకు కూడా పెద్దగా స్పందన లేకపోవడానికి తోడు కనీసం కేసీఆర్ నుండి పిలుపుకూడా రాకపోవడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోక కవిత టీం ఆందోళన చెందుతోందట కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్..ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక కచ్చితంగా స్పందిస్తారని కవిత భావించారట. కానీ ఫామ్ హౌజ్ నుంచి మాత్రం నోరెప్సాన్స్. దీంతో కవిత చాలా నిరాశ చెందారనే చర్చ తెలంగాణ జాగృతి వర్గాల్లో జరుగుతోంది. దీంతో కవితను పార్టీ వద్దనుకుంటోందా.? లేక ఆమెనే పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ మొదలైంది. ఏదేమైనా కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పటికిప్పుడైతే ఏం చెప్పలేని పరిస్థితి అంటున్నారు. ఆమె రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదంటున్నారు. బీఆర్ఎస్‌తో కవిత బంధం తెగినట్లేనా.? లేక ఆమెనే ఓ మెట్టు దిగి కేసీఆర్ గతంలో చెప్పినట్లు సైలెంట్ అయిపోతారా అన్నది వేచి చూడాలి.