Wednesday, January 22, 2025

యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు

- Advertisement -

యాదగిరిగుట్ట పాలక మండలి ఎప్పుడు

When was the governing council of Yadagirigutta

నల్గోండ, డిసెంబర్ 27, (వాయిస్ టుడే)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రూ.1,250 కోట్లతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని పునర్మించింది. ఎన్నో విశేషాలతో కొండపై పాంచనరసింహుల ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. నిత్యం వేలాది మంది.. సెలవు రోజుల్లో 50వేల మందికి పైగా భక్తులు వరకు ఆలయాన్ని సందర్శించి, పలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ తిరుపతిగా భారీస్థాయిలో అభివృద్ధి చేసి ఆలయ పరిపాలనా విధానాన్ని మార్చాలని గత ప్రభుత్వం యోచించింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత గత ప్రభుత్వం ఎలాంటి మండలిని ఏర్పాటు చేయలేదు.యాదగిరిగుట్ట నర్సన్న ఆలయానికి దాదాపుగా దశాబ్దంన్నర నుంచి పాలక మండలి లేదు. చివరిసారిగా 2008లో ఏర్పడిన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. 2010 నుంచి 2024 వరకు దాదాపుగా 14 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరిగింది. ప్రత్యేక అధికారి పాలనలోనే ఆలయ పునర్నిర్మాణం జరిగింది.అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఆలయ నిర్వాహణ సక్రమంగా సాగేలా టీటీడీ తరహాలో యాదగిరిగిరిగుట్టకు ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాలకమండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి వ్యవహరిస్తున్నారు. వంశపారంపర్య ధర్మకర్త లేదా కుటుంబ సభ్యుడు మాత్రమే ఆలయ బోర్డ చైర్పర్సన్ పనిచేయడానికి అర్హులని ఆలయ వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు. వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబంలో సభ్యుడు కాని వ్యక్తిని ఆలయ బోర్డు చైర్పర్సన్ గా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ధర్మకర్త కుటుంబంలో సభ్యుడితోపాటు18 నుంచి 20 సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో ఆలయం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందనున్నదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెబుతున్నారు.పాలక మండలి ఏర్పాటుకు 1987 నాటి తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టాన్ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది. యాదగిరిగుట్ట ఆలయ చట్టానికి నిర్దిష్ట సవరణ చేసి.. ధర్మకర్త కాని కుటుంబ సభ్యుడిని బోర్డు చైర్పర్సన్ నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 151లోని నిర్దిష్ట క్లాజులను సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.ఇదిలావుంటే, ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు, ఆదికేశవులు నాయుడు టీటీడీ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి, ఆలయ బోర్డును నియమించకుండా నిర్దేశి అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ఆధారంగా దేవాదాయ శాఖ చట్టంలో సవరణ చేయాలని న్యాయశాఖ సూచించింది. మరోవైపు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు న్యాయశాఖ కూడా క్లియరెన్స్ ను కూడా ఇచ్చింది. .మరోవైపు యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుతో వచ్చే చట్టపరమైన సమస్యలను నివారించడానికి మార్పులకు అంగీకరించేలా అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వంశపారంపర్య ధర్మకర్త కుటుంబం నుంచి ఎవరూ కూడా న్యాయస్థానం మెట్లు ఎక్కకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎండోమెంట్ చట్టం ప్రకారం పాలకమండలిలో సుమారు 11 మంది సభ్యులను అనుమతించగా, TTDలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల సంఖ్యను 40 మందికి పెంచాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించినప్పుడు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైన విషయాన్ని న్యాయశాఖ పరిశీలించింది.యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చట్టానికి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖ ఇప్ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖ ఇప్పటికే పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటుకు న్యాయశాఖ ఇప్పటికే క్లియరెన్స్ ఇవ్వడంతో అప్రూవల్ కోసం సిఎం రేవంత్ కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట బోర్డు చట్టానికి సీఎం ఆమోదం తెలిపిన తరువాత కేబినెట్ లో ఆమోదం పొందనుంది. యాదగిరిగుట్ట బోర్డు సవరణ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్