Sunday, September 8, 2024

ఆదివాసుల ఓటు ఎటూ..

- Advertisement -

అదిలాబాద్, నవంబర్ 10, (వాయిస్ టుడే ):  ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీ ఓట్లు ఏ పార్టీకి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏ పార్టీకి ఓట్లు వారి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.ఆదివాసులు అంటే అదిలాబాద్ జిల్లాలో క్రమశిక్షణ పేరు గలవారు, గూడెం పెద్ద చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వారు. ఎన్నికల్లో ఆదివాసీలు ఎంతో చైతన్యవంతంగా వ్యవహారిస్తారు. ఓటును నోట్లోకు అమ్ముకోవడానికి అంగీకరించరు.గ్రామ పెద్దలు చెప్పిన తీర్మానం ప్రకారమే ఓటేస్తారు, బాధ్యతగా ఓటేస్తారు. గూడాలలో సుమారు 90 నుంచి 95% ఓట్లు పోలయ్యేలా చూస్తారు. ఇలాంటి చైతన్యత ఓట్లు గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు సెగ్మెంట్లు ఉన్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్ లో అత్యధికంగా ఆదివాసి బిడ్డలు గల సెగ్మెంట్లు మూడు ఉన్నాయి. ఆసిఫాబాద్, బోత్, ఖానాపూర్ షెడ్యూలు తెగలకు రిజర్వ్ చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో సుమారు ఆరున్నర లక్షల ఓట్లు ఉండగా అందులో ఆదివాసుల ఓట్లు సుమారు మూడు లక్షలు ఉంటాయి.మూడు సెగ్మెంట్లలో గెలుపొటములకు ఆదివాసుల ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఆదివాసీలు మిగతా సామాజిక వర్గాలకు భిన్నంగా ఉంటారు,

Where is the tribal vote?
Where is the tribal vote?

మాటకు కట్టుబడి ఉంటారు. ఒకసారి తీసుకున్న నిర్ణయానికి వెనుకకు పోనివ్వరు, ఇలాంటి కీలక ఓట్లు ఏ పార్టీ నేతకు పడతాయో ఆ పార్టీ నేత విజయం ఖాయమవుతుంది.ఆదివాసీలు నోటుకు ఓట్లు వేయరు, ఎలాంటి ప్రలోబాలకు అమ్ముడు పోరు, మద్యానికి బానిసగా ఉండరు, ఎవరైనా నేతలు వచ్చి గూడెంలో తమకే ఓటేయాలని ఎవరైనా ప్రలోభలకు గురి చేసే ప్రయత్నం చేస్తే తిప్పి కొడతారు, గూడెంలో పెద్దలు చెప్పిన మాటని గౌరవిస్తారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు ఓటు వేయరు, అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఓటు వస్తారు. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక స్వరాష్ట్రంలో ఆదివాసీల కష్టాలు తీరుతాయని భావించిన ఆదివాసీలకు మొండి చేయి చూాపారని ఆదివాసీలు టిఆర్ఎస్ పార్టీ పై కోపంతో ఉన్నారు. రెండు సార్లు అధికారం ఇచ్చినా ఆదివాసుల సమస్యలు తీరలేవని, గ్రామాల్లో రోడ్లు వంతెనలు దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వైద్యం అందుబాటులో లేదని, 108 అంబులెన్సులు రావడానికి మార్గాలు లేవని ఆరోపిస్తున్నారు.ఆదివాసీలను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపిస్తున్నారు. మౌలిక సదుపాయాలు సమకూరక పోయినా ఎప్పటినుంచో హామీలో ఉన్న గిరిజన యూనివర్సిటీ జిల్లాకు రాకవడంపై అసంతృప్తికి కారణమైంది.అడవి తల్లి బిడ్డలు అంటే గెలిచిన ప్రభుత్వాలకు పట్టవని, కేవలం ఓట్లు వచ్చినప్పుడు ఐదు ఏళ్ల కు ఒకసారి వచ్చి పోతారని తర్వాత మర్చిపోతారని స్థానిక ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఆదివాసులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆదివాసి పెంద్రం భీమ్రావు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పెద్దలు ఏ విధంగా నిర్ణయిస్తే వారికి ఓటేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసులకు చేసిన సంక్షేమ ఫలాలు తమన గెలిపిస్తాయని బిఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంటే, వ్యతిరేక ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి, మరోవైపు బీజేపీ కే ఆదివాసి ఓట్లు పడుతాయని భావిస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్