సినీ ప్రముఖులు ఎవరు ఎక్కడ ఓటు వేశారో…

- Advertisement -

హైదరాబాద్‌లో  పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు ప్రాధాన్యతను వ్యక్తపరిచారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు.  మణికొండలో హీరో వెంకటేష్, జూబ్లీహిల్స్  ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్  ఎన్టీఆర్  కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. సెంటర్ పోలింగ్ బూత్‌లో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ఓటేశారు.  జూబ్లీహిల్స్  క్లబ్‌లో నటుడు సుమంత్,  జూబ్లీహిల్స్  పబ్లిక్  స్కూల్‌లో కీరవాణి ఓటుహక్కు వినియోగించుకున్నారు.  షేక్ పేటలో సినీ దర్శకుడు రాజమౌళి,  ఫిల్మ్ నగర్  క్లబ్‌లో దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు రానా తమ  ఓటేశారు. నాగార్జున, అమల, నాగచైతన్య…  జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టల్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అలాగే మహేశ్‌ బాబు నమ్రత కూడా జూబ్లీహిల్స్‌లోని జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు వేశారు. ప్రముఖ సీనియర్‌ నటుడు బ్రహ్మానందం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అంతా తమ విలువైన ఓటును వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ శర్మిల హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted
who-and-where-the-movie-stars-voted

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.హాస్య నటుడు బ్రహ్మానందం అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.సినీ హీరో అల్లు అర్జున్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర యువత అంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.మెదక్‌ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి, కొడుకుతో కలిసి ఓటు వేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular