Sunday, September 8, 2024

కాంగీరేసులో ఎవరు…

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 31, (వాయిస్ టుడే  ):  పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి వలసల బాట పట్టారు.కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కి అధిష్టానం ఇంకా టికెట్ ప్రకటించకపోవడం తో నిరాశకు లోనైనా కాటా ప్రధాన అనుచరుడు పటోళ్ల భాస్కర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షం లో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరారు.ఆదివారం సాయంత్రం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయ భాస్కర్ రెడ్డి,మాజీ మున్సిపల్ అధ్యక్షులు పట్లోళ్ళ భాస్కర్ రెడ్డి వారి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. 60 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎద్దెవా చేశారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. నేడు ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీలను తరిమికొట్టడం ఖాయమని ఆయన అన్నారు.పటాన్చెరు లో జరిగిన అభివృద్ధి మా తారక మంత్రం అని అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీ సంఖ్యలో చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు.పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ లో నీలం మధు చేరికతో టికెట్ పోరు మొదలయింది.

Who is in Congress?
Who is in Congress?

ఇప్పటికే కాంగ్రెస్ కు బలమైన నాయకుడుగా ఉన్నకాటా కి టికెట్ ఇస్తారా .. లేక నీలం మధు కు ఇస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు డైలమాలో పడ్డారు.కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండవ లిస్ట్ లో కూడా పటాన్చెరు అభ్యర్థి తేలకపోవడంతో, ఎవరికి టికెట్ వరిస్తుందా అని ఎటు తేల్చుకోలేని పరిస్థితి లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నారని, వారందరినీ సొంత కుటుంబ సభ్యుల వలే చూసుకుంటూ వారి ఆర్థిక ప్రగతికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈసమావేశానికి హాజరైన ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ఠాకూర్ పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ములంగా మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో 29 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే జీఎంఆర్ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం లభించిందని ఆయన అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్