బీజేపీలో చర్చోపచర్చలు
హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): బీజేపీలో సద్దుమణిగిందని అనుకుంటున్న అసంతృప్తి మళ్లీ రాజుకుందా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి … అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్న సమయంలో.. కొందరు కీలక నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది… బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు .. ఆయన బాటలోనే మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారంట..
కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తదనంతర పరిణామాలతో సొంత లెక్కలు వేసుకుని కాంగ్రెస్ ను వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు … మునుగోడు బైపోల్స్ లో బీజేపీ అభ్యర్ధిగా గెలుస్తానన్న ఆయన ధీమాకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది .. దాంతో ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు … బీజేపీలో చేరిక సందర్భంగా ఆయనకు భారీ కాంట్రాక్ట్ వర్కులు లభించాయన్న ప్రచారం జరిగింది .. దాంతో ఆయన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేండెట్ గానే బరిలోకి దిగుతారని భావించారు..
ఆ క్రమంలో ఆయన తనకు ఎల్బీ నగర్ టికెట్ తో పాటు, తన భార్య లక్ష్మికి మునుగోడు టికెట్ ఆశించారంట… అయితే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో .. ఆయన భార్యది కాదు కదా అసలు చిన్న కోమటిరెడ్డి పేరే లేకుండా పోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారంట .. అదీకాక పార్టీలో ఈటల రాజేందర్ కు లభిస్తున్న ప్రాధాన్యత కూడా కోమటిరెడ్డితో పాటు కొందరు సీనియర్లు అప్పటికే అసహనంతో ఉన్నట్లు కనిపించారు …
ఈ నేపథ్యంలో రాజగోపాల్ సహా కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రాష్ట్రంలో మోడీ పర్యటనకు కూడా దూరంగా ఉన్నారు … దానికి తోడు రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు మాత్రం హుజూరాబాద్, గజ్వేల్ లలో పోటీకి అధిష్టానం అవకాశం కల్పించింది … ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ, ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది … రాజగోపాల్ కూడా సానుకూలంగా స్పందించి తిరిగి సొంత గూటికి చేరిపోయారు
రాజగోపాల్‌రెడ్డితో పాటు మరి కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది … వారిలో గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన వివేక్ తో పాటు మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతిలు కూడా ఉన్నారంటున్నారు … అలాగే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు కూడా కోమటిరెడ్డి బాట పట్టే అవశాశం ఉన్నాట్లు ప్రచారం జరుగుతోంది … వీరిలో వివేక్ ఆ ప్రచారాన్ని మీడియా ముఖంగా తిప్పికొడుతున్నారు ..
వీరిలో కొందరు వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తుంటే… హస్తిన పెద్దలు మాత్రం అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశిస్తున్నారంట.. లోక్ సభకు పోటీ చేసి గెలిచి… తిరిగి మోడీ కేంద్రపగ్గాలు చేపడితే మంత్రి అవ్వవచ్చేదనేది వారి ఆలోచనంట.. అయితే తమను అసెంబ్లీకి పరిమితం చేయాలని చూడటంపై వారికి మింగుడుపడటం లేదంట…
అదీకాక కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు… బీఆర్‌ఎస్ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల .. బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటే… అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని వారు అభిప్రాయపడుతున్నారంట … ఆ క్రమంలోనే ఇటీవల అసంతృప్తి నేతలంతా అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమై.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో భేటీ కూడా నిర్వహించారు .. మరి చూడాలి ఎన్నికల టైంకి వీరిలో ఎందరు చిన్న కోమటిరెడ్డిని ఫాలో అవుతారో?….