Tuesday, January 14, 2025

జెండా మోసేదెవరు…

- Advertisement -

జెండా మోసేదెవరు…

Who is the flag bearer?

ఒంగోలు, జనవరి 7, (వాయిస్ టుడే)
బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎన్ఆర్ఐ యడం బాలాజీ నియోజకవర్గంలో లేకుండా అడ్రస్ లేకుండా పొయ్యారు. ఎన్నకల ఫలితాలు వెలువడగానే ఫ్లైట్ ఎక్కేసిన ఆయన అమెరికాలో సొంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడమే మానేశారంట. దాంతోపర్చూరు నియోజకవర్గంలో వైసిపి జెండా మోసే నాయకుడు కరువయ్యాడు.పర్చూరుకు కొత్త ఇన్జార్జిని నియమించాలనీ వైసిపి అధిష్టానం చూస్తుందట. ఇప్పటికే పార్టీ ఆవిర్భావం నుంచి నలుగురు ఇన్‌ఛార్జులను మార్చిన వైసీపీ ఈ సారి లోకల్ వ్యక్తులనే నియమించాలని చూస్తుందట. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డిని నియమించాలన్న ఆలోచనలో వైసీసీ అధ్యక్షుడు జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల పులివెందులకు వచ్చిన జగన్ ప్రస్తుత ఇన్చార్చ్‌గా ఉన్న యడం బాలాజీకి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తునట్లు సమాచారం ఇచ్చారట.గాదే మధుసూదన్ రెడ్డి సొంత ఊరు పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండల పరిధిలోకి వస్తుంది .. ఇటు మాజి మంత్రి గాదే వెంకటరెడ్డి పలు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన అనుభవంతో పాటు ఆ కుటుంబానికి నియోజకవర్గంలో సొంత క్యాడర్ కూడా ఉంది.. దాంతో పర్చూరు వైసీపీ బాధ్యతలను గాదే కుటుంబానికి అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారంట. వైసిపి పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు పర్చూరు నియోజకవర్గంలో బోణి కొట్టలేదు. వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసీసీ బలహీనంగా మారిపోయింది.పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలో టీడీపీ ఏడు సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగురుతుంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో విజయం సాధించేందుకు అభ్యర్థులను మార్చి మార్చి ప్రయోగించినా వైసీపీ విజయం సాధించలేకపోయింది. నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన వైసీపీ ప్రతిసారి ప్రయోగాలతో కొత్తవారిని బరిలోకి దింపినా విజయం సాధించలేకపోయింది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో పాటు సదరు అభ్యర్ధికి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు సమయం సరిపోయేది. అందుకే నియోజకవర్గంలో ఒక్కసారి కూడా వైసీపీ విజయం సాధించలేకపోయిందన్న అభిప్రాయం ఉంది.ప్రధానంగా నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును వైసీపీ ఎదుర్కోలేకపోయింది. 2014 ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల దాకా హ్యాట్రిక్ విజయాలతో పర్చూరులో తిరుగులేని నేతగా ఎదిగారు ఏలూరి సాంబశివరావు. 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఏలూరి సాంబశివరావు ఆ తరువాత సొంత ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ హవా నడిచిన నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గెలుపును అడ్డుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పై సాంబశివరావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మూడోసారి కూటమి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సాంబశివరావు వైసీపీ అభ్యర్థి ఎన్నారై యడం బాలాజీ పై 24 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.మెత్తానికి వైసిపి రాాష్ట్రంలో భారి ఓటమి అనంతరం పార్టీకి రిపేర్లు చేసుకునే పనిలో పడింది. పర్చూరు బాధ్యతాలు గాదే మధుసూధన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించాలని.. అప్పుడే పార్టీ కాస్త అయినా గాడిలో పడే అవకాశముందని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు. ఎన్నికల ముందు ఎవరో ఒకరు రావడం.. ఓడిపోగానే కనపడకుండా పోతుండటంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటోంది. ఇప్పటికే పర్చూరు వైసిపి ఇన్చార్జులను నలుగురిని మార్చింది. ఇప్పుడు మళ్లీ మారిస్తే గాదే మధుసూదన్ రెడ్డి అయిదో కృష్ణుడవుతారు. మరి చూడాలి లోకల్ అయిన మధు సూదన్ పర్చూరు బాధ్యతలు చెపడితే నియోజకవర్గంలో ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్