Friday, November 22, 2024

ఎవరిని ఉంచాలి… ఎవరిని సాగనంపాలి

- Advertisement -

ఎవరిని ఉంచాలి… ఎవరిని సాగనంపాలి

Who to keep… Who to stretch

శ్రీకాకుళం, ఆగస్టు 21
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ ఉద్యోగుల బదిలీలకి తెరలేపింది. ఈ మేరకు 15 శాఖలలో బదిలీల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదే అదనుగా గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగాపనిచేసిన పలువురుని సాగనంపేందుకు ప్రజా ప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే తాము చెప్పినట్లుగా నడుచుకునే వారిని తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణినాయకులు సైతం తమకు కావాల్సిన వారి పేర్లు పట్టుకుని వారినేతమ గ్రామాలలోను, మండలాలలో నియమించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఈ మేరకు సిఫార్సు లేఖలను తీసుకునేందుకుఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు.నేరుగా ఎమ్మెల్యేలతో పరిచయం లేని వారు వారి బంధువులు, వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు ఇతరత్ర వారితో సంప్రదింపులు చేసి అనుకున్నస్థానాలను పొందేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జీరో సర్వీసు నుంచి బదిలీకి అవకాశం కల్పించడంతో ఇదే అదనుగా గత పాలనలో ఇబ్బందులకి గురైన అధికారులు, సిబ్బంది ఇప్పుడులైమ్ లైట్ లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులు ఇప్పుటికే వారి టార్గెట్ మేరకు మండల స్థాయి అధికారులను మార్చేసారు. సిఫార్సు లేఖలు ఇచ్చి కోరుకున్న కొందరిని ఎస్ డిపిఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, సిఐలు, ఎస్.ఐలుగా వారి ప్రాంతాలకి బదిలీ చేపించుకుంటారు. ఇప్పుడు సాధారణ ఉద్యోగుల బదిలీల వంతురానే వచ్చింది. ప్రజలతో సంబంధాలు ఉన్న శాఖలలోనే బదిలీలు జరుగుతుండడంతో ప్రజా ప్రతినిధులు వీటిలో కూడా తమ మార్క్ ఉండేలా కసరత్తులు చేస్తున్నారు. ఇదే అదనుగా అనుకూలమైన స్థానాలలో చేరితే రానున్న ఐదేళ్ళు కొనసాగిపోవచ్చని కొందరు ఉద్యోగులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేర్వేరు శాఖల నుంచి జిల్లా అధికారులుగా డిప్యుటేషన్ లతో కొనసాగుతున్న వారు వాటిలో ఉండేందుకు తప్పి వేరే జిల్లా స్థాయి పోస్టులలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మామిడి గోవిందరావు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ మూడు నెలలోనే ఆయన తన మార్క్ ను సొంతం చేసుకున్నారు. వినూత్న రీతిలో ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీల జీఓను విడుదల చేయగా తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏకంగా పాతపట్నం ఎమ్మెల్యే ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. బదిలీల జిఓపై నాయకులు, కార్యకర్తలకి సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేతో నేరుగా చర్చించవచ్చని పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉన్న గ్రూపులలో ఈ మేరకు శాసనసభ్యుల నియోజకవర్గ కార్యాలయం పేరుతో వర్తమానం అందరికి పంపించారు. ఇది సోషల్ మీడియా గ్రూపులలో హల్ చల్ అవుతుంది. ఉద్యోగుల బదిలీలపై నాయకులకి, కార్యకర్తలకు ఉన్న సందేహాలు ఏంటి …వారితో ఎమ్మెల్యే చర్చించడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామాలలోను ఎవరిని ఉంచాలని… ఎవరిని సాగనంపాలని అన్న విషయంపై ఎమ్మెల్యే చోటా నేతలతో మాట్లాడేందుకే ఈ తరహా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఒక వైపు ప్రభుత్వం ప్రకటిస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేయగా క్షేత్ర స్థాయిలోఅందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్న విషయం స్పష్టమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని పొద్దుటూరులో ఐసిడిఎస్ సిడిపిఓ గా పనిచేస్తున్న విమలారాణి శ్రీకాకుళం జిల్లాలోపాతపట్నంలో ఏర్పాటైన నూతన ప్రోజెక్ట్ కి సిడిపిఓగా డెప్యుటేషన్ పై నియమితులయ్యారు. అప్పట్లో పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి శాంతికి పూర్తిగా ఆమె అనుకూలంగా వ్యవహరిస్తూ కూటమి నేతలకి చుక్కలు చూపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విమలా రాణి డిప్యుటేషన్ ను రద్దు చేయాలని, పాతపట్నం ప్రోజెక్ట్ కి రెగ్యులర్ సిడిపిఓను తిరిగి కొనసాగించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి పలువురు టీడీపీ నాయకులు కోరారు. అలాగే ఆయన కూడా సంబందిత అధికారిణి పనితీరుపై ఆరా తీసి బదిలీ చేయాలని భావించినా ఇంతలో ఏమి జరిగిందో ఏమో గాని తిరిగి డెప్యూటేషన్ పై ఉన్న విమలారాణినే కొనసాగించడం పట్ల ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు పలువురు గుర్రుమంటున్నారు. ప్రస్తుతం బదిలీలలో ఆ శాఖ లేకపోవడంతో ఈ పంచాయితీని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్ళేందుకు పార్టీ నాయకులు రెడీ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు జిల్లాలో అనేక చోట్ల ఉన్నాయి. సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకుని గతంలో కీలక స్థానాలలో పనిచేసే కొందరు అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇప్పుడు అదే సామాజిక వర్గ నేతలను పట్టుకుని కోరుకున్న స్థానాలను సొంతం చేసుకుంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. రాజకీయంగా సిఫార్సులు లేకపోతే కోరుకున్న స్థానాలు దక్కవన్న ఆందోళన ఉద్యోగ వర్గాలలో వ్యక్తమవుతుంది. ఉద్యోగుల బదిలీల వేళ ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్