బిఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యె తీవ్ర పోటీ
వినోద్ స్థానికేతరుడని ముద్ర
చిన్నయ్యపై అనేక ఆరోపణలు
ప్రచారానికి వెళ్తే డబ్బు,మందు, విందు….
డబ్బుల చుట్టూ నడుస్తున్న బెల్లంపల్లి రాజకీయం
బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గ ఓటర్లు ఈఎన్నికల్లో ఎవరికి పట్టాం కడతారొ అనేది ఆసక్తికరంగా మారింది.ఎన్నికల్లో వివిధ పార్టీల నుండి ఇండిపెండెంట్గా మొత్తం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 9 నామినేషన్లు వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు.కాగా 16 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించగా,అందులో నుండి ఎంతమంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటారొ చూడవల్సిఉంది.ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ ల మధ్య పోటీ నెలకొంది.వీరిద్దరూ పోట పోటీగా పార్టీల్లొ చేరికలు, ప్రచారాలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ స్థానికంగా ఉండడని ప్రజల నుండి ఆరోపణలు ఉన్నాయి.గతఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వినోద్ స్థానికంగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ,ఓటమి తర్వాత మళ్లీ బెల్లంపల్లి వైపు కన్నెత్తి చూడలేదని పలువురు ఆరోపిస్తున్నారు.అనేక వ్యాపారాలు ఉన్న వినోద్ ఒకవేళ గెలిస్తే కోట్లాది రూపాయల వ్యాపారాలను వదిలేసి బెల్లంపల్లిలో ఉంటాడా,అని పలువురు ఓటర్లు సందేహ పడుతున్నారు.ఇక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయానికి వస్తే నియోజకవర్గ ప్రజల నుండి ఆయన మీద అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఓరిజిన్ డైరీ సిఏఓ పనిచేసిన శేజల్ ను లైంగికంగా వేధించాడని,చిన్నయ్య పై రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రచారం కూడా జరిగింది.ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను పలు ఇబ్బందులకు గురి చేశాడని,శేజల్ ఇటీవల బెల్లంపల్లికి సైతం వచ్చి గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.ఎమ్మెల్యే చిన్నయ్య చేతిలో తాను మోసపోయానని,నాలాంటి మోసం మరొకరికి జరగవద్దని ఆయనను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రచారం చేయడానికి శేజల్ సిద్ధపడింది. అంతేకాకుండా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎమ్మెల్యే చిన్నయ్య భూ కబ్జాలతోపాటు వివిధ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి.కాగా ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు డబ్బులు సైతం పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారని ప్రజలు అంటున్నారు.ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే ఒక్కొక్కరికి రూపాయలు 300నుండి500ఇవ్వడంతోపాటు మందు,విందు లు సమకూరుస్తున్నారని,ఓటర్లే బాహటంగా చెబుతున్నారు.కాగా ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారొ వేసి చూడాలి మరి.