Saturday, February 8, 2025

నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?

- Advertisement -

నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?

Why did KTR change his word on funds?

హైదరాబాద్, డిసెంబర్ 30, (వాయిస్ టుడే)
ఫార్ములా ఈ కారు రేస్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? దీన్ని నుంచి బయట పడేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? నిధుల విడుదలకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారా? తొలుత అడ్వాన్స్ చెల్లించామని అంగీకరించిన కేటీఆర్, ఎందుకు మాట మార్చారు? హెచ్ఎండీఏ ఛైర్మన్, ఆ శాఖ మంత్రి అనుమతి లేకుండా అధికారులు నిధులు ఎలా విడుదల చేశారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.ఫార్ములా ఈ కారు రేస్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురికీ శనివారం నోటీసులు ఇచ్చింది. జనవరి రెండు- బీఎల్ఎన్ రెడ్డి, మూడు- అరవింద్ కుమార్, ఏడు- కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. అయితే విచారణకు తనకు కొంత గడువు కావాలని ఈడీని కేటీఆర్ కోరినట్టు సమాచారం.యూకెకు చెందిన ఫార్ములా కంపెనీ ఈ ఆపరేషన్స్-ఎఫ్ఈవోకు పౌండ్ల రూపంలో నిధులు బదిలీపై దృష్టి పెట్టింది ఈడీ. ఆ కోణంలోనే ఆరా తీస్తోంది. ఈ క్రమంలో తొలుత అధికారులను విచారించనుంది. అక్కడ లభించిన ఆధారాలతో కేటీఆర్‌ను విచారించాలన్నది అధికారుల ఆలోచన.ఎందుకంటే అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎఫ్ఈవోకు నిధులు బదిలీ చేసినట్టు అధికారి అరవింద్‌కుమార్ గత జనవరిలో సీఎస్‌కు లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తుకు ఇదే కీలకంగా మారింది. హిమాయత్ నగర్‌లోన ఐవోబీ బ్రాంచ్ నుంచి గతేడాది అక్టోబరులో రెండు విడతలుగా నిధులు బదిలీ చేశారు.ఆర్బీఐ అనుమతి లేకపోవడంతో సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా హెచ్ఎండీఏ పెనాల్టీ కట్టింది. లండన్‌లో ఎఫ్ఈవో ఖాతాకు నిధులు చేరిన తర్వాత అవి వేరే ఖాతాలోకి బదిలీ అయ్యాయా? అనేదానిపై ఈడీ లోతుగా ఆరా తీస్తోందని సమాచారం. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ ప్రకారం.. యూకెతో భారత్‌కు ఒప్పందమున్న నేపథ్యంలో ఈడీ సంప్రదింపులు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లండన్ నుంచి నిధులు ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.ఇదిలావుండగా న్యాయస్థానంలో రిప్లై అఫిడవిట్‌లో కేటీఆర్ కీలక విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపులతో తనకు సంబంధం లేదన్నారట. విధాన పరమైన అంశాలు చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండీఏ చూసుకోవాలన్నారు.10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీపై తనకు ఎలాంటి సంబంధం లేదన్నది ఆయన మాట. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దేనన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్