ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి : అక్టోబర్ 28(వాయిస్ టుడే): కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ శనివారం తెలంగాణ గార్డెన్స్ లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ 60 ఏళ్ల నుండి ప్రజల నీటి కష్టాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదన్నారు. పి. జనార్దన్ రెడ్డి వేల మంది మహిళలతో మంచినీళ్లు కావాలని ధర్నా చేయడం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరని, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంచినీటి సమస్య తీరిందన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎప్పటికీ మంచినీటికి ఇబ్బంది లేకుండా 9 రిజర్వ ట్యాంకులు నిర్మించుకున్నామని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మించుకున్నామని గుర్తుచేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఫతేనగర్ లో నూతనంగా అండర్పాస్ నిర్మాణం చేపట్టబోతున్నామని ఇదంతా కూడా కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి అని ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీకి మంచినీరు, రోడ్లు నిరంతర విద్యుత్తు నేడు అందించగలుగుతున్నామని, ఇదంతా కేసిఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. చిన్నప్పటినుండి కూకట్ పల్లి లో పెరిగి ఇక్కడ ప్రజలతో మమేకమైన వ్యక్తినని, ఎలక్షన్లు వచ్చినప్పుడు కనీసం స్థానికులకి టిక్కెట్లు కేటాయించలేని పరిస్థితులు ఇతర పార్టీలకు ఉన్నాయంటే వారి దయనీయ స్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ అధిష్టానాలకు ఇక్కడ పనిచేసిన నాయకులు కార్యకర్తలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ పార్టీలు చేసే మోసాల వల్ల అట్టడుగు స్థాయి కార్యకర్త ఎంతో మనోవేదన చెందుతున్నారని, కానీ నేడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే నిబద్దత కలిగిన కార్యకర్తగా నిలుస్తున్నారని అన్నారు. కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు. తిరిగి మళ్లీ ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒక పార్టీ కులాలు, మతాలు మధ్య భేదాలు సృష్టించే పార్టీ అయితే మరొక పార్టీ సీట్లు కోసం కొట్టుకునే పార్టీయని, వారి పబ్బం కట్టుకోవడానికి చేసే ఈ జిమ్ముక్కులను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.