Sunday, September 8, 2024

భద్రతా వైఫల్యాలు ఎందుకు..

- Advertisement -

భద్రతా వైఫల్యాలు ఎందుకు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)
లోక్‌సభ లోపలకి ఇద్దరు ఆగంతకులు చోరబడడం.. వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం తెలిసిందే. అయితే పార్లమెంట్‌కే భద్రత లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ ఇలానే సెక్యూరిటీ బ్రీచ్‌ జరిగిందని గుర్తు చేస్తున్నారు.బిల్డప్‌ ఇచ్చుకోవడం తప్పు కాదు.. నిజానికి బిల్డప్‌లు ఇచ్చి ఎవరిని వారు ఎలివేట్ చేసుకోవాలి. అయితే బిల్డప్‌లు ఎక్కువ బిజినెన్‌ తక్కువ ఉంటే మాత్రం అందరూ నవ్వుతారు. ఎగతాళి చేస్తారు. విమర్శలు గుప్పిస్తారు. ఫైర్ అవుతారు. దేశ భద్రతాకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎంతటివారినైనా సామాన్యులు ఏకిపారేస్తారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌ భవనంపై దాడి అంటే యావత్‌ దేశంపై దాడి జరిగినట్లే. అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడమంటే దేశం ప్రజల భద్రత పట్ల అలసత్వం వహించినట్లే అంటున్నారు నెటిజన్లు. లోక్‌సభ లోపల ఇద్దరు.. పార్లమెంట్‌ ఆవరణలో మరో ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల స్మోక్‌ స్టిక్‌లు పట్టుకోని కర్ణాటకు చెందిన మనోరంజన్, సాగర్‌ శర్మ హల్‌చల్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమవగా.. పార్లమెంట్‌ సెక్యూరిటీని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.నవంబర్‌ 19న జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ సెక్యూరిటీ ఉల్లంఘన జరగడం బీసీసీఐ పరువు పోయేలా చేసింది. ప్రధాని మోదీ కూడా వచ్చిన ఈ మ్యాచ్‌లో భద్రతా లోపం ఉందన్న విమర్శలు వినిపించాయి. మ్యాచ్‌ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకురావడం కలకలం రేపింది. 13.3 ఓవర్లలో ఇండియా 93/3 వద్ద బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో కోహ్లీ, రాహుల్ ఉన్నారు. సడన్‌గా ఓ వ్యక్తి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. వైట్‌ టీ షర్ట్‌తో పాటు ఓ ఫ్లాగ్‌ పట్టుకోని గ్రౌండ్‌లోకి వచ్చాడు. వచ్చి రావడమే కోహ్లీ దగ్గరకు వెళ్లాడు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చినా ఆ సంబంధిత వ్యక్తి మాత్రం కోహ్లీ భుజంపై చేయి వేశాడు. ఈ లోపే సిబ్బంది వచ్చి అతడిని పట్టుకుపోయారు. దుండుగుడు ఇలా సడన్‌ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్‌ కొద్ది సేపు ఆగింది. కాసేపటికి రెజ్యూమ్‌ అయ్యింది. తర్వాత ఆ వ్యక్తిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌గా గుర్తించాడు. విరాట్ కోహ్లీని కలవడానికి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చానని.. తాను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నానని చెప్పాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్