పట్టణ అభివృద్ధి కృషి చేస్తా

- Advertisement -

పట్టణ అభివృద్ధి కృషి చేస్తా

ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మున్సిపల్ సర్వసభ్య సమావేశం

కోరుట్ల
పట్టణంలోని వివిధ వార్డుల్లోని సమస్యలను రాబోవు రోజుల్లో దశలవారీగా పరిష్కరించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కోరుట్ల
ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆన్నారు.
బుధవారం కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య- అనిల్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విచ్చేశారు ..ఈ సమావేశంలో 3 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యుల సమస్యలను రాబోవు రోజుల్లో దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు.. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య మాట్లాడుతూ సభ్యులు వార్డులలోని ప్రజలచే మున్సిపల్ కు చెల్లించవలసిన పనులను వెంటనే చెల్లించే విధంగా సహకరించాలని కోరారు.. ఈ సమావేశంలో కోరుట్ల పట్టణంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే నివారించుటకు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయుటకు కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుటకు సభ్యులు ఆమోదించారు.. ఈ సమావేశంలో
వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ టి. రాజేశ్వర్, డివై ఈఈ అభినయ్, ఏఈజే జయలక్ష్మి ,టిపిఓ ఏ. ప్రవీణ్ ,టిపిఎస్ రమ్య, మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, జేఏవో శివ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ శాఖ అధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular