Will work to solve public problems :
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల,
ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో బల్దియా కార్యాలయంలో మంళవారం బల్దియా చైర్ పర్సన్ అధ్యక్షతన‘‘ ప్రజా దర్బార్ ‘‘ కార్యక్రమం నిర్వహించారు. కరెంటు స్తంభాలు, వీధిలైట్లు, డ్రైనేజీల, రోడ్డు, ఖాళీ స్థలంలో చెత్త చెదారం పలు వివిధ సమస్యలున్నాయని తెలుపగా బల్దియా చైర్ పర్సన్ కు ఫిర్యాదులు, వినతుల ద్వారా తెలుపగా బల్దియా అధికారులతో ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.బల్దియా కార్యాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలు వార్డుల్లో నెలకొన్న సమస్యలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ సమ్మయ్య, బల్దియా అధికారులు, అర్జీదారులు, సిబ్బంది, పాల్గొన్నారు.