Sunday, September 8, 2024

గెలుపు…ఓటములు

- Advertisement -

ఎల్లారెడ్డిలో మధన్‌మోహన్‌ గెలుపు
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మధన్‌మోహన్‌ విజయం సాధించారు.

సనత్‌నగర్‌లో మంత్రి తలసాని విజయం
సతన్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హ్యట్రిక్‌ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎవరూ వరుసగా విజయం సాధించలేదు. ఇప్పుడు హ్యట్రిక్‌ విజయం రికార్డ్‌ను తలసాని తన ఖాతాలో వేసుకున్నారు.

సాగర్‌లో జానారెడ్డి కొడుకు జయ్‌వీర్‌రెడ్డి గెలుపు
నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జయ్‌వీర్‌రెడ్డి గెలుపొందారు.

మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం
మేడ్చల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు.

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి యశశ్వినిరెడ్డి విజయం సాధించారు.

రేవంత్‌రెడ్డి గెలుపు
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపొందారు. 32,800 ఓట్ల తేడాతే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై విజయం సాధించారు.

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజయం
హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు.

మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌ విజయం
మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డిపై విజయం సాధించారు.

అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ విజయం సాధించారు.

బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజయం
తెలంగాణలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజయం 3900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఆందోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు
ఆందోల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజనర్సింహా గెలుపొందారు. 24,402 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌ గెలుపు
తెలంగాణలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. దుబ్బాక నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం
తెలంగాణలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్‌ రౌండ్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. 54 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.

నాగార్జున సాగర్‌లో జానారెడ్డి కొడుకు గెలుపు
నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జయవీర్‌రెడ్డి గెలుపొందారు.

మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం
మేడ్చల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు.

భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ విజయం
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. అలాగే నల్గొండలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 54 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.

కాంగ్రెస్‌ ఖాతాలోకి వరంగల్ పశ్చిమ నియోజకర్గం
వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో 9వ రౌండ్ ముగిసే సరికి 5618 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి గెలుపొందారు.

బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపు
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జుక్కల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం
జుక్కల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌షింధేపై సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీకాంతరావు 1734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ విజయం
ఉమ్మడిఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎష్‌ బోణి కొట్టింది. 4466 ఓట్లతో భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు.

రామగుండంలో కాంగ్రెస్‌ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అశ్వారావుపేట, ఇల్లందుతో పాటు రామగుండంలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చందర్‌పై విజయం సాధించారు.

చార్మినార్‌లో ఎంఐఎం విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి చేసింది. చార్మినార్‌ నియోజకవర్గ అభ్యర్థి జుల్ఫికర్‌ అలీ విజయం సాధించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్