తెలంగాణ భవన్ లో  ఎమ్మెల్యే అభ్యర్థులతో …

- Advertisement -

అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు  సమావేశం

బీ-ఫారాలను అభ్యర్థులకు అందజేత

పార్టీ మేనిఫెస్టో విడుదల

అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన

నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్  నామినేషన్

బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీ-ఫారాలను అధినేత సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాల గురించి అభ్యర్థులకు అధ్యక్షులు సీఎం కేసీఆర్  వివరిస్తారు. సూచనలు ఇస్తారు.

కాగా.. అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు.  అనంతరం అదే రోజు (అక్టోబర్ 15)న హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

With MLA candidates in Telangana Bhavan...
With MLA candidates in Telangana Bhavan…

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :

తెల్లారి… అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలలో సీఎం పాల్గొంటారు.

17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలలో సీఎం కేసీఆర్  పాల్గొంటారు.

అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ నామినేషన్లు :

నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.   ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.  అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular